1000 Names of Divine Mother
Lalita Sahasranamam
śrīlalitāsahasranāmāvaliḥ sārthā
లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి
యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం
ప్రచారం లోకి వచ్చింది.
ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర
స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన
సమస్త యోగ క్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు
ప్రతిజ్ఞ పూనింది.
కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం
భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు.
ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.
నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం….. కానీ
బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం.
ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము
అంటేలెక్కపెట్టలేని సహస్ర శీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్ అంటే ఖచ్చితంగా
లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు
కలిగినది అని.
అనంతమైన నామములు ఎందుకు ఉండాలి??
ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. మనసుతో
పలకాలి:
లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి
నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు.
లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు
ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి
పోవాలి.
శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప
ప్రమాణం. ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో
మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది.
విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి.
అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం
వస్తుంది.
ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం.
- జీవితం తరిస్తుంది.
- అపమృత్యువు పోతుంది.
- ఆయుష్షు పెరుగుతుంది.
- ఆరోగ్యం బాగుంటుంది.
- సర్వపాపాలు తొలగిపోతాయి.
- ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.
అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.
స్వస్తి…!!
ఓం శ్రీ మాత్రేనమః!!
అస్య శ్రీలలితాసహస్రనామస్తోత్రమహామంత్రస్య వశిన్యాదివాగ్దేవతా ఋషయః,
అనుష్టుప్ ఛందః, శ్రీలలితాపరమేశ్వరీ దేవతా, శ్రీమద్వాగ్భవకూటేతి బీజం,
మధ్యకూటేతి శక్తిః, శక్తికూటేతి కీలకం, మూలప్రకృతిరితి ధ్యానం,
మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం చ కుర్యాత్ | మమ శ్రీలలితామహాత్రిపురసుందరీ
ప్రసాదసిద్ధిద్వారా చింతితఫలావాప్త్యర్థే జపే వినియోగః |
కరన్యాసః
ఐం అంగుష్టాభ్యాం నమః,
క్లీం తర్జనీభ్యాం నమః,
సౌః మధ్యమాభ్యాం నమః,
సౌః అనామికాభ్యాం నమః,
క్లీం కనిష్ఠికాభ్యాం నమః,
ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసః
ఐం హృదయాయ నమః,
క్లీం శిరసే స్వాహా,
సౌః శిఖాయై వషట్,
సౌః కవచాయ హుం,
క్లీం నేత్రత్రయాయ వౌషట్,
ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః
ధ్యానమ్
సిందూరారుణవిగ్రహాం త్రిణయనాం మాణిక్యమౌళిస్ఫుర-
-త్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||
ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||
సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||
లమిత్యాది పంచపూజా
లం – పృథివీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |
సం – సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై సర్వోపచారాన్ పరికల్పయామి |
అథ స్తోత్రమ్
శ్రీ మాతా, శ్రీ మహారాఙ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ |
చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా || 1 ||
1. శ్రీమాతా: మంగళకరమైన, శుభప్రథమైన తల్లి. She who is the auspicious
Mother.
2. శ్రీ మహారాజ్ఞీ: శుభకరమైన గొప్పదైన రాణి. She who is the Empress of
the Universe.
3. శ్రీ మత్సింహాసనేశ్వరి: శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును
అధిష్ఠించింది. She who is the queen of the most glorious throne.
4. చిదగ్ని కుండ సంభూతా: చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా
ఆవిర్భావము చెందినది. She who was born in the fire-pit of Pure
Consciousness.
5. దేవకార్య సముద్యతా: దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది. She
who is intent on fulfilling the wishes of the gods.
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా || 2 ||
6. ఉద్యద్భాను సహస్రాభా: ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క
కాంతులతో సమానమైన కాంతి కలది. She who has the radiance of a thousand
rising suns
7. చతుర్బాహు సమన్వితా: నాలుగు చేతులతో కూడినది. She who is
four-armed.
8. రాగస్వరూప పాశాఢ్యా: అనురాగ స్వరూపముగా గల పాశముతో
ఒప్పుచున్నది. She who is holding the rope of love in Her hand.
9. క్రోధాకారాంకుశోజ్జ్వలా: క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో
ప్రకాశించుచున్నది. She who shines, bearing the goad of anger.
మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా || 3 ||
10. మనో రూపేక్షు కోదండా: మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ
విల్లును ధరించింది. She who holds in Her hand a sugarcane bow that
represents the mind.
11. పంచతన్మాత్ర సాయకా: ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది. She
who holds the five subtle elements as arrows.
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా: తన సహజమైన ఎఱ్ఱని
కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది. She
who immerses the entire universe in the red effulgence of Her form.
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా || 4 ||
13. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా: సంపంగి, అశోక, పున్నాగ,
చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది. She whose
hair has been adorned with flowers like campaka, ashoka, punnAga and
saugandhika.
14. కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా: పద్మరాగముల వరుసచేత
ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది. She who is resplendent with
a crown adorned with rows of kuruvinda gems.
అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా || 5 ||
15. అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా: అష్టమినాటి చంద్రుని వలె
ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది. She
whose forehead shines like the crescent moon of the eighth night of
the lunar half-month.
16. ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా: ముఖము అనెడి చంద్రునియందు
మచ్చవలె ఒప్పెడు కస్తూరి బొట్టును కలిగినది. She who wears a musk mark
on Her forehead which shines like the spot in the moon.
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా || 6 ||
17. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా: ముఖమనెడు మన్మథుని శుభమైన
నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది. She whose eyebrows shine
like the archways leading to the house of kAma, the god of love, which
Her face resembles.
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా: ముఖదీప్తి అనెడు
సంపదప్రథమైన స్రోతస్సునందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు
కలిగినది. She whose eyes possess the luster of the fish that move
about in the stream of beauty flowing from Her face.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా || 7 ||
19. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా: క్రొత్తగా వికసించుచున్న
సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది. She who is
resplendent with a nose that has the beauty of a newly blossoming
campaka flower.
20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా: ఆకాశములో ప్రకాశించునట్లు
కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత
ప్రకాశించునది. She who shines with a nose-ornament that excels the
luster of a star.
కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా |
తాటంక యుగళీభూత తపనోడుప మండలా || 8 ||
21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా: కడిమి పూల గుచ్చముల చేత
కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా
నున్నది. She who is captivating, wearing bunches of kadamba flowers as
ear-ornaments
22. తాటంక యుగళీభూత తపనోడుప మండలా: చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య
చంద్ర మండలమును గలది. She who wears the sun and the moon as a pair of
large earrings.
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా || 9 ||
23. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః – పద్మరాగ మణుల అద్దమును పరిహసించు
చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది. She whose cheeks excel mirrors made of
rubies in their beauty.
24. నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా – కొత్తదైన పగడముల యొక్క
దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది. She whose lips excel
freshly cut coral and bimba fruit in their reflective splendor.
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |
కర్పూరవీటి కామోద సమాకర్ష ద్దిగంతరా || 10 ||
25. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా – శుద్ధమైన విద్య
అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు
జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది. She who
has radiant teeth which resemble the buds of pure knowledge.
26. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా – కర్పూరపు తాంబూలము యొక్క సువాసన
లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది. She
who is enjoying a camphor-laden betel roll, the fragrance of which is
attracting people from all directions.
నిజసల్లాప మాధుర్య వినిర్భర్-త్సిత కచ్ఛపీ |
మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా || 11 ||
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ – తన యొక్క సంభాషణ యొక్క
తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ
గలది. She who excels even the vīṇa of Sarasvatī in the sweetness of
Her speech.
28. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా – చిరునవ్వు అనే కాంతి
ప్రవాహమునందు మునకలిడుతున్న శివుని మనస్సు కలిగినది. ఆమె తన చిరునవ్వు
యొక్క ప్రకాశంలో శివుడు యొక్క మనస్సును కూడా ముంచెత్తుతుంది. She who
submerges even the mind of Kamesha (Lord shiva) in the radiance of Her
smile.
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా || 12 ||
29. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా – లభ్యము గాని లేదా దొరకని
పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది. She whose chin cannot be
compared to anything (it is beyond comparison because of its
unparalleled beauty).
30. కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా – పరమశివుని చేత కట్టబడిన
మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది. She
whose neck is adorned with the marriage thread tied by Kāmesha.
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |
రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా || 13 ||
31. కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా – బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన
బాహువులు కలిగినది. She whose arms are beautifully adorned with golden
armlets.
32. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా – రత్నముల చేత కంఠమునందు
ధరించు చింతాకు అనే ఆభరణముతో కదులుచున్న ముత్యాలహారంతో కూడినది. She
whose neck is resplendent with a gem-studded necklace with a locket
made of pearl.
కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ|
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ || 14 ||
33. కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్తనీ – కామేశ్వరుని యొక్క ప్రేమ
అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు
గలది. She who gives Her breasts to KAmeshvara in return for the gem of
love He bestows on Her.
34. నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ – బొడ్డు అనెడి పాదు లోని నూగారు
అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది. She whose breasts
are the fruits on the creeper of the fine hairline that starts in the
depths of Her navel and spreads upwards.
లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా |
స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా || 15 ||
35. లక్ష్య రోమలతాధారతఅ సమున్నేయ మధ్యమా – కనబడుచున్న నూగారు అనెడు తీగను
అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది. She who has a waist, the existence
of which can only be inferred by the fact that the creeper of Her
hairline springs from it.
36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా – వక్షముల బరువు చేత విరుగుచున్న
నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలౌ గలది. She
whose abdomen has three folds which form a belt to support Her waist
from breaking under the weight of Her breasts.
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ |
రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా || 16 ||
37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ – ఉదయ సూర్యుని రంగువలె
కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
She whose hips are adorned with a garment as red as the rising sun,
which is dyed with an extract from safflower (kusumbha) blossoms.
38. రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా – రత్నములతో కూడిన చిరుగంటలతో
అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది. She who is adorned with a
girdle which is decorated with many gem-studded bells.
కామేశ ఙ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా |
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా || 17 ||
39. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా – కామేశ్వరునికి మాత్రమే
తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది. The beauty
and softness of whose thighs are known only to kAmesha, Her husband
40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా – మాణిక్య సంబంధమైన కిరీటము వంటి
ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది. She whose knees are like
crowns shaped from the precious red jewel, mAnikya (a kind of ruby).
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా |
గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా || 18 ||
41. ఇంద్రగోప పరీక్షిప్త స్మర తూణాభజంఘికా – ఆరుద్ర పురుగుల చేత చుట్టును
పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది. She whose
calves gleam like the jewel-covered quiver of the God of Love
42. గూఢగుల్ఫా – నిండైన చీలమండలు గలది. She whose ankles are hidden
43. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా – తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు
భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది. She whose feet
have arches that rival the back of a tortoise in smoothness and
beauty.
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా |
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా || 19 ||
44. నఖదీధితి సంఛన్న సమజ్జన తమోగుణా – గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా
కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది. She whose
toenails give out such a radiance that all the darkness of ignorance
is dispelled completely from those devotees who prostrate at Her feet.
45. పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా – పాదముల జంట యొక్క కాంతి సముదాయము
చేత తిరస్కరింపబడిన పద్మములు గలది. She whose feet defeat lotus flowers
in radiance.
శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా |
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః || 20 ||
46. శింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజా – ధ్వని చేయుచున్న మణులు గల
అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది. She whose
auspicious lotus feet are adorned with gem-studded golden anklets that
tinkle sweetly.
47. మరాళీ మందగమనా – హంసవలె ఠీవి నడక కలిగినది. She whose gait is as
slow and gentle as that of a swan.
48. మహాలావణ్య శేవధిః – అతిశయించిన అందమునకు గని లేదా నిధి. She who is
the treasure-house of beauty.
సర్వారుణాஉనవద్యాంగీ సర్వాభరణ భూషితా |
శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా || 21 ||
49. సర్వారుణా – సర్వము అరుణ వర్ణంగా భాసించునది. She who is entirely
red in complexion.
50. అనవద్యాంగీ – వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది. She whose body
is worthy of worship.
51. సర్వాభరణ భూషితా – సమస్తమైన నగల చేత అలంకరించబడింది. She who is
resplendent with all types of ornaments.
52. శివకామేశ్వరాంకస్థా – శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క
తొడయందున్నది. She who sits in the lap of shiva, who is the conqueror
of desire
53. శివా – వ్యక్తమైన శివుని రూపము కలది. She who bestows all that is
auspicious.
54. స్వాధీన వల్లభా – తనకు లోబడిన భర్త గలది. She who keeps Her husband
always under Her control.
సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా |
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా || 22 ||
55. సుమేరు శృంగమధ్యస్థా – మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో
ఉంది. She who sits on the middle peak of Mount Sumeru.
56. శ్రీమన్నగర నాయికా – శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు
అధిష్ఠాత్రి. She who is the Mistress of the most auspicious (or
prosperous)
57. చింతామణి గృహాంతఃస్థా – చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
She who resides in a house built of the chintAmaNi
58. పంచబ్రహ్మాసనస్థితా – ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉంది.
She who sits on a seat made of five BrahmAs.
మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ || 23 ||
59.మహాపద్మాటవీ సంస్థా – మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు
చక్కగా ఉంది. She who resides in the great lotus forest.
60. కదంబ వనవాసినీ – కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది. She who
resides in the kadamba forest.
61. సుధాసాగర మధ్యస్థా – చక్కగా గుర్తించుకొని తనయందు ధరించి అవసరమైనపుడు
వ్యక్తము చేయగలుగునది. She who resides in the center of the ocean of
nectar.
62. కామాక్షీ – అందమైన కన్నులు గలది. She whose eyes awaken desire, or
She who has beautiful eyes.
63. కామదాయినీ – కోరికలను నెరవేర్చునది. She who grants all wishes.
దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా || 24 ||
64. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా – దేవతల యొక్క, ఋషుల యొక్క,
గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము
గలది. She whose might is the subject of praise by multitudes of gods
and sages.
65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా – భండుడు అను రాక్షసుని
సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది. She
who is endowed with an army of shaktis intent on slaying bhaNDAsura.
సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా |
అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా || 25 ||
66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా – సంపత్కరీ దేవి చేత చక్కగా
అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడింది. Who is attended by a
herd of elephants ably commanded by sampatkarI.
67. అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా – అశ్వారూఢ అనే దేవి చేత
ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది. She who is
surrounded by a cavalry of several million horses which are under the
command of the shakti, ashvArUDhA.
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా || 26 ||
68. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా – చక్రరాజము అను పేరుగల రథములో
అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది. She who shines in Her
chariot chakrarAja, equipped with all kinds of weapons.
69. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా – గేయచక్రము అని పేరుగల రథమును
అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది. She who is
served by the shakti named mantriNI who rides the chariot known as
geyacakra.
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||
70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా – కిరిచక్రము అను పేరుగల రథమును
ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.
She who is escorted by the shakti known as daNDanAthA, seated in the
kirichakra chariot.
71. జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా – జ్వాలా మాలిని అను
పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క
మధ్యనున్నది. She who has taken position at the center of the fortress
of fire created by the goddess, jvAlAmAlinI.
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా – భండాసురుణ్ణి, అతని
సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని
చూచి ఆనందించింది. She who rejoices at the valor of the shaktis who are
intent on destroying the forces of bhaNDAsura.
73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా – నిత్యాదేవతల యొక్క పరులను
ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది. She who
delights in seeing the might and the pride of Her nityA deities.
భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా – భండాసురుని పుత్రులను
సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది. She
who delights in seeing the valor of the goddess bAla who is intent on
killing the sons of bhaNDa.
75. మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా – మంత్రిణీ దేవి చేత చేయబడిన
విషంగ వధను విని సంతసించింది. She who rejoices at the destruction, in
battle, of the demon viShanga by the mantriNI shakti.
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా || 30 ||
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా – విశుక్రుని ప్రాణాలను హరించిన
వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది. She who is pleased with
the prowess of vArAhI who took the life of vishukra.
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా – కామేశ్వరుని యొక్క ముఖమును
చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది. She who gives rise to
gaNesha by a glance at the face of kAmeshvara.
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ || 31 ||
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా – మహాగణపతి చేత
నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది. She who
rejoices when gaNesha shatters all obstacles.
79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ – రాక్షస రాజైన
భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను
కురిపించునది. She who showers counter weapons to each weapon fired at
Her by bhaNDAsura.
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా || 32 ||
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః – చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి
పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది. She who created from Her
fingernails all ten incarnations of NArAyaNa (viShNu).
81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా – మహా పాశుపాతమునకు
దేవతయైన సదాశివుని అస్త్రాగ్నిచే భండాసుర సైనికులను దగ్ధము చేసినది. She
who burned the armies of the demons in the fire of the missile,
mahApAshupata.
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా || 33 ||
82. కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా దహింపబడిన భండాసురునితో కూడిన
శూన్యకా నగరము గలది. She who burned and destroyed bhaNDAsura and his
capital shUnyaka with the kAmeshvara missile.
83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవా – బ్రహ్మ, విష్ణువు,
ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది. She whose
many powers are extolled by brahmA, viShNu, shiva and other
gods.
హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా || 34 ||
84. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః – శివుని యొక్క మూడవ కంటికి
నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా
పునర్జీవనము ప్రసాదించునది. She who became the life-giving medicine for
kAmadeva (the god of love) who had been burned to ashes by the fire
from shiva's (third) eye.
85. శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా – మంగళకరమైన లేదా
మహిమాన్వితమైన వాగ్భవము అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల
పద్మము వంటి ముఖము గలది. She whose lotus face is the auspicious
vAgbhavakUTa (a group of syllables of the panchadashi mantra).
కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ || 35 ||
86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ – కంఠము యొక్క క్రింద నుండి
నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును మధ్యకూట
స్వరూపముగా గలది. She who from Her neck to Her waist is of the form of
the madhyakUTa (the middle six syllables of the panchadashAkShari
mantra).
87. శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ – శక్తికూటముతో సామ్యమమును
పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది. She whose form below
the waist is the shaktikUTa (the last four syllables of the
pancadashAkShari mantra).
మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా |
కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ || 36 ||
88. మూలమంత్రాత్మికా – మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును
ఆత్మస్వరూపముగా గలది. She who is the embodiment of the mUla mantra
(the pancadashAkShari mantra)
89. మూలకూట త్రయకళేబరా – మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
She whose (subtle) body is made of the three parts of the
pancadashAkShari mantra
90. కులమృతైక రసికా – కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి
కలది. She who is especially fond of the nectar known as kula.
91. కులసంకేత పాలినీ – కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది. She who
protects the code of rituals of the path of yoga known as kula.
కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ |
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా || 37 ||
92. కులాంగనా – కుల సంబంధమైన స్త్రీ. She who is well-born (who is from
a good family).
93. కులాంతఃస్థా – కులము యొక్క మద్యములో ఉంది. She who resides in the
kula vidyA.
94. కౌలినీ – కులదేవతల రూపంలో ఆరాధింపబడునది. She who belongs to the
kula.
95. కులయోగినీ – కుండలినీ యోగ దేవతా స్వరూపిణి. She who is the deity in
the kulas.
96. అకులా – అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది. She who does not have
a family.
97. సమయాంతఃస్థా – సమయాచార అంతర్వర్తిని. She who resides inside
'samaya'.
98. సమయాచార తత్పరా – సమయ అనే ఆచారములో ఆసక్తి కలది. She who is attached
to the samaya form of worship.
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ || 38 ||
99. మూలాధారైక నిలయా – మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది. She
whose principal abode is the mUlAdhAra.
100. బ్రహ్మగ్రంథి విభేదినీ – బ్రహ్మగ్రంథిని విడగొట్టునది. She who
breaks through the knot of brahma.
101. మణిపూరాంతరుదిరా – మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా
ప్రకటమగునది. She who emerges in the maNipUra cakra.
102. విష్ణుగ్రంథి విభేదినీ –విష్ణుగ్రంథిని విడగొట్టునది. She who
breaks through the knot of viShNu.
103-151
ఆఙ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ || 39 ||
103. ‘ఆజ్ఞాచక్రాంతరాళస్థా’- ఆజ్ఞాచక్ర మధ్యమున నుండునది. She who
resides at the center of the Aj~nA chakra.
104. ‘రుద్రగ్రంథి విభేదినీ’ – రుద్రగ్రంథి ద్వయమును విశేషముగ
భేదించునది. She who breaks through the knot of shiva.
105. ‘సహస్రారాంబుజారూఢా’ – వేయి సంఖ్యల దళములు గల పద్మము
అధిష్ఠించియున్న శ్రీదేవి అని అర్థము. She who ascends to the
thousand-petaled lotus.
106. ‘సుధాసారాభివర్షిణీ, – సహస్రార కమలము యొక్క ‘కర్ణిక’ (తూడు లేక కాడ)
నుండి అమృతధారలు వర్షింప చేయునది. She who pours out streams of
ambrosia.
తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా |
మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ || 40 ||
107. తటిల్లతా సమరుచిః – మెఱపుతీగతో సమానమగు కాంతి గలది. She who is as
beautiful as a flash of lightning.
108. షట్చక్రోపరి సంస్థితా – ఆరు విధములైన మూలాధారాది చక్రముల యొక్క
పైభాగమందు చక్కగా నున్నది. She who resides above the six chakrAs.
109. మహాసక్తిః – బ్రహ్మమునందు ఆసక్తి గలది. She who is greatly attached
to the festive union of shiva and shakti.
110. కుండలినీ – పాము వంటి ఆకారము గలది. She who has the form a coil.
111. బిసతంతు తనీయసీ – తామరకాడలోని ప్రోగువలె సన్నని స్వరూపము గలది. She
who is fine and delicate as the fiber of the lotus.
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ || 41 ||
112. భవానీ – భవుని భార్య. She who is the wife of bhava (shiva).
113. భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది. She who is unattainable
through imagination or thought.
114. భవారణ్య కుఠారికా – సంసారమనెడు అడవికి గండ్రగొడ్డలి వంటిది. She who
is like an axe to clear the jungle of samsAra.
115. భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.
She who is fond of all auspicious things - who gives all auspicious
things.
116. భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది. She who is the
embodiment of auspiciousness or benevolence.
117. భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. She who
confers prosperity on Her devotees.
భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ || 42 ||
118. భక్తప్రియా – భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది. She who is fond
of (and pleased by) devotion.
119. భక్తిగమ్యా – భక్తికి గమ్యమైనటువంటిది. She who is attained only
through devotion.
120. భక్తివశ్యా – భక్తికి స్వాధీనురాలు. She who is to be won over by
devotion.
121. భయాపహా – భయములను పోగొట్టునది. She who dispels fear.
122. శాంభవీ – శంభుని భార్య. She who is the wife of shambhu (shiva).
123. శారదారాధ్యా – సరస్వతిచే ఆరాధింపబడునది. She who is worshipped by
sharadA (sarasvatI, the goddess of speech).
124. శర్వాణీ – శర్వుని భార్య. She who is the wife of sharva (shiva).
125. శర్మదాయినీ – శాంతిని, సుఖమును ఇచ్చునది. She who confers
happiness.
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా || 43 ||
126. శాంకరీ – శంకరుని భార్య. She who gives happiness.
127. శ్రీకరీ – ఐశ్వర్యమును ఇచ్చునది. She who bestows riches in
abundance.
128. సాధ్వీ – సాధు ప్రవర్తన గల పతివ్రత. She who is chaste.
129. శరచ్చంద్ర నిభాననా – శరత్కాలము లోని చంద్రునితో సమానమైన వదనము గలది.
She whose face shines like the full moon in the clear autumn sky.
130. శాతోదరీ – కృశించిన లేదా సన్నని పొట్ట గలిగినది. She who is slender
stomach.
131. శాంతిమతీ – శాంతి గలది. She who is peaceful.
132. నిరాధారా – ఆధారము లేనిది. She who is without dependence.
133. నిరంజనా – మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది. She who
stays unattached, bound to nothing.
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా || 44 ||
134. నిర్లేపా –కర్మ బంధములు అంటనిది. She who is free from all
impurities arising from action.
135. నిర్మలా –ఏ విధమైన మలినము లేనిది. She who is free from all
impurities
136. నిత్యా –నిత్య సత్య స్వరూపిణి. She who is eternal.
137. నిరాకారా –ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. She who is without form
138. నిరాకులా –భావ వికారములు లేనిది. She who is without agitation
139. నిర్గుణా –గుణములు అంటనిది. She who is beyond all three gunas of
nature, namely sattva, rajas and tamas.
140. నిష్కలా –విభాగములు లేనిది. She who is without parts
141. శాంతా –ఏ విధమైన ఒడిదుడుకులు, తొట్రుపాటు లేనిది. She who is
tranquil
142. నిష్కామా –కామము, అనగా ఏ కోరికలు లేనిది. She who is without
desire.
143. నిరుపప్లవా –హద్దులు ఉల్లంఘించుట లేనిది. She who is
indestructible.
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా || 45 ||
144. నిత్యముక్తా –ఎప్పుడును సంగము లేనిది. She who is ever free from
worldly bonds.
145. నిర్వికారా –ఏ విధమైన వికారములు లేనిది. She who is unchanging.
146. నిష్ప్రపంచా –ప్రపంచముతో ముడి లేనిది. She who is not of this
universe.
147. నిరాశ్రయా –ఆశ్రయము లేనిది లేదా అవసరము లేనిది. She who does not
depend on anything.
148. నిత్యశుద్ధా –ఎల్లప్పుడు శుద్ధమైనది. She who is eternally pure.
149. నిత్యబుద్ధా –ఎల్లప్పుడు జ్ఞాన స్వరూపురాలు. She who is ever wise.
150. నిరవద్యా –చెప్పరానిది అంటూ ఏమీ లేనిది లేదా నిందించుటకూ ఏదీ
లేనిది. She who is blameless or She who is praiseworthy.
151. నిరంతరా – ఏ మాత్రము సందు లేకుండా అంతటా వ్యాపించింది. She who is
all-pervading.
నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా |
నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ || 46 ||
152. నిష్కారణా –ఏ కారణము లేనిది. She who is without cause.
153. నిష్కళంకా –ఎటువంటి దోషము లేదా పాపము లేనిది. She who is faultless.
154. నిరుపాధిః –ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. She who is
not conditioned or has no limitations.
155. నిరీశ్వరా – ఇంకా తనను పైన ప్రభువు అనువారెవరూ లేనిది. She who has
no superior or protector.
156. నీరాగా –రాగము అనగా కోరికలు లేనిది. She who has no desire.
157. రాగమథనీ –రాగమును పోగొట్టి, వైరాగ్యమును కలుగుజేయునది. She who
destroys desires (passions).
158. నిర్మదా –మదము లేనిది. She who is without pride.
159. మదనాశినీ –మదమును పోగొట్టునది. She who destroys pride.
నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ || 47 ||
160. నిశ్చింతా –ఏ చింతలూ లేనిది. She who has no anxiety in anything.
161. నిరహంకారా –ఏ విధమైన అహంకారము లేనిది. She who is without egoism.
She who is without the concept of 'I' and 'mine'
162. నిర్మోహా –అవగాహనలో పొరపాటు లేనిది అనగా మోహము లేనిది. She who is
free from delusion.
163. మోహనాశినీ –మోహమును పోగొట్టునది. She who destroys delusion in Her
devotees.
164. నిర్మమా –మమకారము లేనిది. She who has no self-interest in
anything.
165. మమతాహంత్రీ –మమకారమును పోగొట్టునది. She who destroys the sense of
ownership.
166. నిష్పాపా –పాపము లేనిది. She who is without sin.
167. పాపనాశినీ –పాపములను పోగొట్టునది. She who destroys all the sins of
Her devotees.
నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ || 48 ||
168. నిష్క్రోధా –క్రోధము లేనిది. She who is without anger.
169. క్రోధశమనీ –క్రోధమును పోగొట్టునది. She who destroys anger in Her
devotees.
170. నిర్లోభా –లోభము లేనిది. She who is without greed.
171. లోభనాశినీ –లోభమును పోగొట్టునది. She who destroys greed in Her
devotees.
172. నిస్సంశయా –సందేహములు, సంశయములు లేనిది. She who is without doubts.
173. సంశయఘ్నీ –సంశయములను పోగొట్టునది. She who kills all doubts
174. నిర్భవా –పుట్టుక లేనిది. She who is without origin.
175. భవనాశినీ –పుట్టుకకు సంబంధించిన సంసార బంధక్లేశములు లేకుండా
చేయునది. She who destroys the sorrow of samsAra (the cycle of birth
and death).
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా || 49 ||
176. నిర్వికల్పా –వికల్పములు లేనిది. She who is free of false
imaginings.
177. నిరాబాధా –బాధలు, వేధలు లేనిది. She who is not disturbed by
anything.
178. నిర్భేదా –భేదములు లేనిది. She who is beyond all sense of
difference.
179. భేదనాశినీ –భేదములను పోగొట్టునది. She who removes from Her
devotees all sense of differences born of vAsanAs.
180. నిర్నాశా –నాశము లేనిది. She who is imperishable.
181. మృత్యుమథనీ –మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది. She who
destroys death.
182. నిష్క్రియా –క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది. She who remains
without action.
183. నిష్పరిగ్రహా –స్వీకరణ, పరిజనాదులు లేనిది. She who does not
acquire or accept anything.
నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా || 50 ||
184. నిస్తులా –సాటి లేనిది. She who is incomparable, unequalled.
185. నీలచికురా –చిక్కని, చక్కని, నల్లని, ముంగురులు గలది. She who has
shining black hair.
186. నిరపాయా –అపాయములు లేనిది. She who is imperishable.
187. నిరత్యయా –అతిక్రమింప వీలులేనిది. She who cannot be transgressed.
188. దుర్లభా –పొందశక్యము కానిది. She who is won only with much
difficulty.
189. దుర్గమా –గమింప శక్యము గానిది. She who is approachable only with
extreme effort.
190. దుర్గా –దుర్గాదేవి. She who is the Goddess DurgA.
191. దుఃఖహంత్రీ –దుఃఖములను తొలగించునది. She who is the destroyer of
sorrow.
192. సుఖప్రదా –సుఖములను ఇచ్చునది. She who is the giver of happiness.
దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా |
సర్వఙ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా || 51 ||
193. దుష్టదూరా –దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది. She who is
unapproachable by sinners.
194. దురాచార శమనీ –చెడు నడవడికను పోగొట్టునది. She who stops evil
customs.
195. దోషవర్జితా –దోషములచే విడిచి పెట్టబడింది. She who is free from all
faults
196. సర్వజ్ఞా –అన్నిటినీ తెలిసింది. She who is omniscient.
197. సాంద్రకరుణా –గొప్ప దయ గలది. She who shows intense compassion.
198. సమానాధిక వర్జితా –ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ
వారు తక్కువ వారు లేనిది. She who has neither equal nor superior.
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ || 52 ||
199. సర్వశక్తిమయీ –సర్వశక్తి స్వరూపిణి. She who has all the divine
powers (she who is omnipotent).
200. సర్వమంగళా –సర్వమంగళ స్వరూపిణి. She who is the source of all that
is auspicious.
201. సద్గతి ప్రదా –మంచి మార్గమును ఇచ్చునది. She who leads into the
right path.
202. సర్వేశ్వరీ –జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి. She who
rules over all the living and non-living things.
203. సర్వమయీ –సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది. She who pervades
every living and non-living thing.
204. సర్వమంత్ర స్వరూపిణీ –అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది. She
who is the essence of all the mantras.
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా || 53 ||
205. సర్వయంత్రాత్మికా –అన్ని యంత్రములకు స్వరూపముగా గలది. She who is
the soul of all yantras.
206. సర్వతంత్రరూపా –అన్ని తంత్రములను తన రూపముగా గలది. She who is the
soul (embodiment) of all tantras.
207. మనోన్మనీ –మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది. She who is
shiva's shakti.
208. మాహేశ్వరీ –మహేశ్వర సంబంధమైనది. She who is the wife of maheshvara.
209. మహాదేవీ –మహిమాన్వితమైన ఆధిపత్యము కలది. She who has the
immeasurable body.
210. మహాలక్ష్మీ –గొప్పవైన లక్ష్మలు గలది. She who is the great goddess
lakShmI.
211. మృడప్రియా –శివుని ప్రియురాలు. She who is the beloved of mRiDa
(shiva).
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః || 54 ||
212. మహారూపా –గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది. She who has a
great form.
213. మహాపూజ్యా –గొప్పగా పూజింపబడునది. She who is the greatest object
of worship.
214. మహాపాతక నాశినీ –ఘోరమైన పాతకములను నాశనము చేయునది. She who destroys
even the greatest of sins.
215. మహామాయా –మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. She who is the great
illusion.
216. మహాసత్వా – మహిమాన్వితమైన ఉనికి గలది. She who possesses great
sattva.
217. మహాశక్తిః –అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. She who has great
power.
218. మహారతిః –గొప్ప ఆసక్తి గలది. She who is boundless delight.
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ || 55 ||
219. మహాభోగా –గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది. She who has
immense wealth.
220. మహైశ్వర్యా –విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది. She who has
supreme sovereignty.
221. మహావీర్యా –అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది. She who is supreme
in valor.
222. మహాబలా –అనంతమైన బలసంపన్నురాలు. She who is supreme in might.
223. మహాబుద్ధిః – అద్వితీయమైన బుద్ధి గలది. She who is supreme in
intelligence.
224. మహాసిద్ధిః –అద్వితీయమైన సిద్ధి గలది. She who is endowed with the
highest attainments.
225. మహాయోగేశ్వరేశ్వరీ –గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి. She who
is the object of worship even by the greatest of yogis.
మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా |
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా || 56 ||
226. మహాతంత్రా –గొప్పదైన తంత్ర స్వరూపిణి. She who is worshipped by the
great Tantras such as kulArnava and jnAnArnava.
227. మహామంత్రా –గొప్పదైన మంత్ర స్వరూపిణి. She who is the greatest
mantra.
228. మహాయంత్రా –గొప్పదైన యంత్ర స్వరూపిణి. She who is in the form of
the great yantras.
229. మహాసనా –గొప్పదైన ఆసనము గలది. She who is seated on great seats.
230. మహాయాగ క్రమారాధ్యా –గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో
ఆరాధింపబడునది. She who is worshipped by the ritual of mahAyAga.
231. మహాభైరవ పూజితా –ఆదిత్య మండలంలో మధ్యనవుండే మహాభైరవుడు (శివుడు) చేత
పూజింపబడింది. She who is worshipped even by mahAbhairava (ferocious
form of shiva).
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ || 57 ||
232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ –సదాశివునిచే మహాప్రళయ సమయమునందు
చేయబడు గొప్ప తాండవ నృత్యమును సాక్షి స్వరూపిణి. She who is the witness
of the great dance of maheshvara (shiva) at the end of the great cycle
of creation.
233. మహా కామేశ మహిషీ –మహేశ్వరుని పట్టపురాణి. She who is the great
queen of mahAkAmeshvara (shiva).
234. మహాత్రిపుర సుందరీ –గొప్పదైన త్రిపురసుందరి. She who is the great
tripurasundarI.
చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |
మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా || 58 ||
235. చతుష్షష్ట్యుపచారాఢ్యా –అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడునది. She
who is adored in sixty-four ceremonies.
236. చతుష్షష్టి కళామయీ –అరువది నాలుగు కళలు గలది. She who embodies the
sixty-four fine arts.
237. మహాచతుష్షష్టి కోటియోగినీ గణసేవితా –గొప్పదైన అరువది కోట్ల యోగినీ
బృందముచే సేవింపబడునది. She who is attended (served) by sixty-four
crores of bands of yoginis.
మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా |
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా || 59 ||
238. మనువిద్యా –మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. She who is the
embodiment of manuvidyA.
239. చంద్రవిద్యా –చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి. She who is
the embodiment of chandravidya.
240. చంద్రమండలమధ్యగా –చంద్ర మండలములో మధ్యగా నుండునది. She who resides
in the center of chandramaNDala, the moon's disc.
241. చారురూపా –మనోహరమైన రూపము కలిగినది. She who has a beauty that does
not wax or wane.
242. చారుహాసా –అందమైన మందహాసము కలది. She who has a beautiful smile.
243. చారుచంద్రకళాధరా –అందమైన చంద్రుని కళను ధరించునది. She who wears of
beautiful crescent moon that does not wax or wane.
చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా |
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా || 60 ||
244. చరాచర జగన్నాథా -కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు. She who is
the ruler of the animate and inanimate worlds.
245. చక్రరాజ నికేతనా -చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది. She
who abides in the shrI chakra.
246. పార్వతీ -పర్వతరాజ పుత్రి. She who is the daughter of the Mountain
(Mount Himavat or HimAlaya).
247. పద్మనయనా -పద్మములవంటి నయనములు కలది. She who has eyes that are
long and beautiful like the petals of the lotus flower.
248. పద్మరాగ సమప్రభా -పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది. She
who has a resplendent red complexion like the ruby.
పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ |
చిన్మయీ, పరమానందా, విఙ్ఞాన ఘనరూపిణీ || 61 ||
249. పంచప్రేతాసనాసీనా –పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర,
సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది. She who sits on the seat formed
by the five corpses.
250. పంచబ్రహ్మస్వరూపిణీ –పంచబ్రహ్మల స్వరూపమైనది. She whose form is
composed of the five brahmas.
251. చిన్మయీ –జ్ఞానముతో నిండినది. She who is consciousness itself.
252. పరమానందా –బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము. She who is
supreme bliss.
253. విజ్ఞానఘనరూపిణీ –విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. She who
is the embodiment of all-pervading solid intelligence.
ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా |
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా || 62 ||
254. ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా –ధ్యానము యొక్క, ధ్యానము చేయువాని యొక్క,
ధ్యాన లక్ష్యము యొక్క సమన్వయ రూపము కలది. She who shines as meditation,
meditator and the object of meditation.
255. ధర్మాధర్మ వివర్జితా – విహితకర్మలు, అవిహిత కర్మలు లేనిది. She who
is devoid of (who transcends) both virtue and vice.
256. విశ్వరూపా –విశ్వము యొక్క రూపమైనది. She who has the whole universe
as Her form.
257. జాగరిణీ –జాగ్రదవస్థను సూచించునది. She who is in the waking state,
or She who assumes the form of the jIva who is in the waking state.
258. స్వపంతీ –స్వప్నావస్థను సూచించునది. She who is in the dream state
or She who assumes the form of the jIva in the dream state.
259. తైజసాత్మికా –తేజస్సువంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్ఠాత్రి. She
who is the soul of taijasA (jIva in the dream state, proud of its
subtle body).
సుప్తా, ప్రాఙ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా |
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ || 63 ||
260. సుప్తా –నిద్రావస్థను సూచించునది. She who is in the deep-sleep
state or assumes the form of the jiva experiencing deep sleep.
261. ప్రాజ్ఞాత్మికా –ప్రజ్ఞయే స్వరూపముగా గలది. She who is not separate
from prAj~nA (deep sleep).
262. తుర్యా –తుర్యావస్థను సూచించునది. She who is in the state of turya
(fourth state in which the ultimate realization of Atman is obtained).
263. సర్వావస్థా వివర్జితా –అన్ని అవస్థలను విడిచి అతీతముగా నుండునది.
She who transcends all states.
264. సృష్టికర్త్రీ –సృష్టిని చేయునది. She who is the creator.
265. బ్రహ్మరూపా –బ్రాహ్మణ లక్షణము గల రూపము గలది. She who is in the
form of brahma.
266. గోప్త్రీ –గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం కలది. She who
protects.
267. గోవిందరూపిణీ –విష్ణుమూర్తితో రూప సమన్వయము కలది. She who has
assumed the form of govinda (viShNu) for the preservation of the
universe.
సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ |
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా || 64 ||
268. సంహారిణీ –ప్రళయకాలంలో సమస్త వస్తుజీవజాలాన్ని తనలోనికి ఉపసంహరణ
గావించి, లీనము చేసుకొనునది. She who is the destroyer of the universe.
269. రుద్రరూపా –రుద్రుని యొక్క రూపు దాల్చింది. She who is has assumed
the form of rudra (shiva) for the dissolution of the universe.
270. తిరోధానకరీ –మఱుగు పరచుటను చేయునది. She who causes the
disappearance of all things.
271. ఈశ్వరీ –ఈశ్వరుని యొక్క శక్తిరూపములో ఉండునది. She who protects and
rules everything.
272. సదాశివా –సదాశివ స్వరూపిణి. She who is sadAshiva, one who always
bestows auspiciousness.
273. అనుగ్రహదా –అనుగ్రహమును ఇచ్చునది. She who confers blessing
274. పంచకృత్య పరాయణా –సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే అయిదు
కృత్యముల యందు ఆసక్తి కలది. She who is devoted to the five functions
(of creation, preservation, destruction, annihilation and
reappearance).
భానుమండల మధ్యస్థా, భైరవీ, భగమాలినీ |
పద్మాసనా, భగవతీ, పద్మనాభ సహోదరీ || 65 ||
275. భానుమండల మధ్యస్థా –సూర్య మండలములో కేంద్రము వద్ద ఉండునది. She who
abides at the center of the sun's disc.
276. భైరవీ –భైరవీ స్వరూపిణి. She who is the wife of bhairava (shiva).
277. భగమాలినీ –వెలుగుతూ గమనము చేయువారిచే హారముగా అగుపించునది. She who
wears a garland made of the six excellences (of auspiciousness,
supremacy, fame, valor, detachment and knowledge).
278. పద్మాసనా –పద్మమును నెలవుగా కలిగినది. She who is seated in the
lotus flower.
279. భగవతీ – భగశబ్ద స్వరూపిణి. She who protects those who worship Her.
280. పద్మనాభ సహోదరీ –విష్ణుమూర్తి యొక్క సహోదరి. She who is viShNu's
sister.
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః |
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ || 66 ||
281. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి –తెరువబడుటతోను, మూయబడుటతోను
పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. She who causes a series of
worlds to arise and disappear with the opening and closing of Her
eyes.
282. సహస్రశీర్షవదనా –వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది. She
who has a thousand heads and faces.
283. సహస్రాక్షీ –వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది. She who has a
thousand / infinite eyes.
284. సహస్రపాత్ – అనంతమైన పాదములు కలది. She who has a thousand/
infinite feet.
ఆబ్రహ్మ కీటజననీ, వర్ణాశ్రమ విధాయినీ |
నిజాఙ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్య ఫలప్రదా || 67 ||
285. ఆ బ్రహ్మకీటజననీ –బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ తల్లి. She who
is the mother of everything from brahmA to the lowliest insect.
286. వర్ణాశ్రమ విధాయినీ –వర్ణములను, ఆశ్రమములను ఏర్పాటు చేయునది. She
who established the order of the social division in life.
287. నిజాజ్ఞారూపనిగమా –తనయొక్క ఆదేశములే రూపుగట్టుకొనిన వేదములు అయినది.
She whose commands take the form of the vedas.
288. పుణ్యాపుణ్యఫలప్రదా –మంచిపనులకు, చెడ్డపనులను వాటి వాటికి తగిన
ఫలములను చక్కగా ఇచ్చునది. She who dispenses the fruits of both good and
evil actions.
శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా |
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా || 68 ||
289. శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా -వేదములనెడు స్త్రీలయొక్క
పాపిటలను, సిందూరము ధరించునట్లు చేసిఅన్ పాదపద్మము యొక్క ధూళిని
కలిగినది. She who is the one the dust from whose feet forms the
vermillion marks at the parting line of the hair of the shruti devatAs
(vedas personified as goddesses).
290. సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా –అన్ని ఆగమ శాస్త్రములనెడు ముత్యపు
చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. She who is
the pearl enclosed in the shell made of all the scriptures.
పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ |
అంబికా,உనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా || 69 ||
291. పురుషార్థప్రదా –పురుషునకు కావలసిన ప్రయోజనములను చక్కగా ఇచ్చునది.
She who grants the (four-fold) objects of human life.
292. పూర్ణా – పూర్ణురాలు. She who is always whole, without growth or
decay.
293. భోగినీ –భోగములను అనుభవించునది లేదా భోగములను ఇచ్చునది. She who is
the enjoyer.
294. భువనేశ్వరీ –చతుర్దశ భువనములకు అధినాథురాలు. She who is the ruler
of the universe.
295. అంబికా – తల్లి. She who is the mother of the universe.
296. అనాదినిధనా –ఆది, అంతము లేనిది. She who has neither beginning nor
end.
297. హరిబ్రహ్మేంద్ర సేవితా –విష్ణువు చేత, బ్రహ్మ చేత, ఇంద్రుని చేత
సేవింపబడునది. She who is attended by brahmA, viShNu and indra.
నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా |
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా || 70 ||
298. నారాయణీ –నారాయణత్వ లక్షణము గలది. She who is the female
counterpart of nArAyaNa.
299. నాదరూపా –నాదము యొక్క రూపము అయినది. She who is in the form of
sound.
300. నామరూపవివర్జితా –పేరు, ఆకారము లేనిది. She who has no name or
form.
301. హ్రీంకారీ –హ్రీంకార స్వరూపిణి. She who is the form of syllable
'hrIM'.
302. హ్రీమతీ –లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. She who is endowed with
modesty.
303. హృద్యా –హృదయమునకు ఆనందము అయినది. She who abides in the heart.
304. హేయోపాదేయవర్జితా –విడువదగినది, గ్రహింపదగినది, లేనిది. She who has
nothing to reject or accept.
రాజరాజార్చితా, రాఙ్ఞీ, రమ్యా, రాజీవలోచనా |
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా || 71 ||
305. రాజరాజార్చితా –రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది. She who is
worshipped by the King of kings.
306. రాఙ్ఞీ –కామేశ్వరునికే రాణి. She who is the queen of shiva, the
Lord of all kings.
307. రమ్యా –మనోహరమైనది. She who gives delight; She who is lovely.
308. రాజీవలోచనా –పద్మములవంటి కన్నులు కలది. She whose eyes are like
rAjiva (lotus).
309. రంజనీ –రంజింప చేయునది లేదా రంజనము చేయునది. She who delights the
mind.
310. రమణీ –రమింపచేయునది. She who gives joy.
311. రస్యా –రస స్వరూపిణి. She who is to be enjoyed; She who enjoys.
312. రణత్కింకిణి మేఖలా –మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా
వడ్డాణము గలది. She who wears a girdle of tinkling bells.
రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా |
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా || 72 ||
313. రమా –లక్ష్మీదేవి. She who has become lakShmI and sarasvatI.
314. రాకేందువదనా –పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది. She who has a
delightful face like the full moon.
315. రతిరూపా –ఆసక్తి రూపమైనది. She who is in the form of rati, the
wife of kAma.
316. రతిప్రియా –ఆసక్తి యందు ప్రీతి కలది. She who is fond of rati; She
who is served by rati.
317. రక్షాకరీ –రక్షించునది. She who is the protector.
318. రాక్షసఘ్నీ –రాక్షసులను సంహరించునది. She who is the slayer of the
entire race of demons.
319. రామా –ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది. She who gives
delight.
320. రమణ లంపటా –రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది. She
who is devoted to the Lord of Her heart, Lord shiva.
కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా |
కల్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా || 73 ||
321. కామ్యా –కోరదగినటువంటిది. She who is to be desired.
322. కామకళారూపా –కామేశ్వరుని కళయొక్క రూపమైనది. She who is in the form
of kAmakalA.
323. కదంబకుసుమప్రియా –కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది. She who is
especially fond of kadamba flowers.
324. కల్యాణీ –శుభ లక్షణములు కలది. She who bestows auspiciousness
325. జగతీకందా –జగత్తుకు మూలమైనటువంటిది. She who is the root of the
whole world.
326. కరుణా రససాగరా –దయాలక్షణానికి సముద్రము వంటిది. She who is the
ocean of compassion.
కలావతీ, కలాలాపా, కాంతా, కాదంబరీప్రియా |
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా || 74 ||
327. కలావతీ –కళా స్వరూపిణీ. She who is the embodiment of all arts
328. కలాలాపా –కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది. She who speaks
musically and sweetly.
329. కాంతా –కామింపబడినటువంటిది. She who is beautiful.
330. కాదంబరీ ప్రియా –పరవశించుటను ఇష్టపడునది. She who is fond of mead.
331. వరదా –వరములను ఇచ్చునది. She who grants boons generously.
332. వామనయనా –అందమైన నేత్రములు గలది. She who has beautiful eyes.
333. వారుణీమదవిహ్వలా –వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.
She who is intoxicated by vAruNi (ambrosial drink).
విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ |
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ || 75 ||
334. విశ్వాధికా –ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు. She who
transcends the universe.
335. వేదవేద్యా –వేదముల చేత తెలియదగినది. She who is known through the
vedas.
336. వింధ్యాచలనివాసినీ –వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది. She who
resides in the vindhya mountains.
337. విధాత్రీ –విధానమును చేయునది. She who creates and sustains this
unverse.
338. వేదజననీ –వేదములకు తల్లి. She who is the mother of the vedas.
339. విష్ణుమాయా –విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి. She who is the
illusory power of viShNu.
340. విలాసినీ –వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది. She who is
playful.
క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రఙ్ఞ పాలినీ |
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా || 76 ||
341. క్షేత్రస్వరూపా –క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా
నుండునది. She whose body is matter.
342. క్షేత్రేశీ – క్షేత్రమునకు అధికారిణి. She who is the wife of
kShetresha (shiva).
343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ –స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన
దేహిని పాలించునది లేదా రక్షించునది. She who is the protector of matter
and the knower of matter, therefore the protector of body and soul.
344. క్షయవృద్ధివినిర్ముక్తా –తరుగుదల, పెరుగుదల లేనిది. She who is free
from growth and decay.
345. క్షేత్రపాల సమర్చితా – క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది. She
who is worshipped by kShetrapAla (shiva in infant form).
విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా |
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ || 77 ||
346. విజయా –విశేషమైన జయమును కలిగినది. She who is ever-victorious.
347. విమలా –మలినములు స్పృశింపనిది. She who is without a trace of
impurity.
348. వంద్యా –నమస్కరింపతగినది. She who is adorable, worthy of worship.
349. వందారుజనవత్సలా –నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
She who is full of motherlly love for those who worship Her
350. వాగ్వాదినీ –వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు
పరావాగ్దేవత. She who speaks.
351. వామకేశీ –వామకేశ్వరుని భార్య. She who has beautiful hair or She
who is the wife of Vāmakeshi.
352. వహ్నిమండవాసినీ –అగ్ని ప్రాకారమునందు వసించునది. She who resides in
the disc of fire.
భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ |
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా || 78 ||
353. భక్తిమత్కల్పలతికా –భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది. She who
is the kalpa (wish-granting) creeper to Her devotees.
354. పశుపాశ విమోచనీ –వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను
చేయునది. She who releases the ignorant from bondage.
355. సంహృతాశేషపాషండా –సంహరింపబడిన సకలమైన పాషడులు కలది. She who
destroys all heretics.
356. సదాచారప్రవర్తికా –సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి
యుండునట్లు ప్రవర్తింప చేయునది. She who is immersed in (and inspires
others to follow) right conduct.
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోஉపహా || 79 ||
357. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా –ఆధ్యాత్మిక, అధిభౌతిక,
అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును
కలుగజేయునట్టి వెన్నెల వంటిది. She who is the moonlight that gives joy
to those burned by the triple fire of misery.
358. తరుణీ –ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది. She who is
ever young.
359. తాపసారాధ్యా –తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది. She who is
worshipped by ascetics.
360. తనుమధ్యా –కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది. She
who is slender-waisted.
361. తమో పహా – చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది. She who removes
the ignorance born of tamas.
చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ |
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః || 80 ||
362. చితిః –కూర్పు, జ్ఞానబిందు సమీకరణ. She who is in the form of pure
intelligence
363. తత్పదలక్ష్యార్థా –తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క
ప్రయోజనముగా నున్నది. She who is the embodiment of truth (which is
indicated by the word 'tat')
364. చిదేకరసరూపిణీ – జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా
స్వరూపముగా గలది. She who is of the nature of the pure intelligence.
She who is the cause of knowledge.
365. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః –తనకు సంబంధించిన
ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము – మొదలైన ఆనందముల
సమూహము గలది. She who makes the bliss of brahmA and others
insignificant compared to Her own bliss
పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా |
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా || 81 ||
366. పరా –పరాస్థితిలోని వాగ్రూపము. She who is the supreme; She who
transcends all.
367. ప్రత్యక్చితీరూపా –స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది. She
who is of the nature of unmanifested consciousness or of unmanifested
brahman.
368. పశ్యంతీ –రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు. She who is
pashyantI, the second level of sound after parA in the svAdhiShTAna
chakra.
369. పరదేవతా –పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము. She who is the
supreme deity; parAshakti.
370. మధ్యమా –పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన
వాక్కు. She who stays in the middle.
371. వైఖరీరూపా –స్పష్టముగా వ్యక్తమైన వాక్కు. She who is in the form of
vaikharI (sound in the manifested, audible form).
372. భక్తమానసహంసికా –భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస. She
who is the swan in the minds of Her devotees.
కామేశ్వర ప్రాణనాడీ, కృతఙ్ఞా, కామపూజితా |
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా || 82 ||
373. కామేశ్వరప్రాణనాడీ –శివుని ప్రాణనాడీ స్వరూపిణి. She who is the
very life of kAmeshvara, Her consort.
374. కృతజ్ఞా –చేయబడే పనులన్నీ తెలిసింది. She who knows all of our
actions as they occur.
375. కామపూజితా –కామునిచే పూజింపబడునది. She who is worshipped by kAma.
376. శృంగారరససంపూర్ణా –శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను
కూడి నిండుగా ఉంది. She who is filled with the essence of Love.
377. జయా –జయస్వరూపిణి. She who is victorious always and everywhere.
378. జాలంధరస్థితా –జాలంధరసూచిత స్థానము నందున్నది. She who resides in
the jAlandhara pITha (in the throat region).
ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ |
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా || 83 ||
379. ఓడ్యాణపీఠనిలయా –ఓడ్యాణ పీఠమునందు ఉంది. She whose abode is the
center known as oDyANa (in the Aj~nA chakra).
380. బిందుమండలవాసినీ –బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
She who resides in the bindumaNDala (in shrI chakra).
381. రహోయాగక్రమారాధ్యా –ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా
ఆరాధింపబడునది. She who is worshipped in secret through sacrificial
rites.
382. రహస్తర్పణతర్పితా – రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది. She
who is to be gratified by the secret rites of worship.
సద్యః ప్రసాదినీ, విశ్వసాక్షిణీ, సాక్షివర్జితా |
షడంగదేవతా యుక్తా, షాడ్గుణ్య పరిపూరితా || 84 ||
383. సద్యఃప్రసాదినీ –తక్షణములోనే అనుగ్రహించునది. She who bestows Her
grace immediately.
384. విశ్వసాక్షిణీ –విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి. She who is
witness to the whole universe.
385. సాక్షివర్జితా –సాక్షి లేనిది. She who has no other witness.
386. షడంగదేవతాయుక్తా –ఆరు అంగదేవతలతో కూడి ఉంది. She who is accompanied
by the deities of the six angAs (heart, head, hair, eyes, armor and
weapons).
387. షాడ్గుణ్య పరిపూరితా –ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి
యుండునది. She who is fully endowed with the six good qualities
(prosperity, valor, dispassion, fame, wealth and wisdom)
నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ |
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ || 85 ||
388. నిత్యక్లిన్నా –ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది. She who
is ever compassionate.
389. నిరుపమా –పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది. She who is
incomparable.
390. నిర్వాణసుఖదాయినీ –సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష
సంబంధమైన ఆనందమును ఇచ్చునది. She who confers the bliss of Liberation.
391. నిత్యాషోడాశికారూపా – నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము. She who
is in the form of the sixteen daily deities (i.e., kAmeshvari,
bhagamAlinI, nityaklinnA, bheruNDA, vahnivAsinI, mahAvajreshvarI,
shivadUtI, tvaritA, kulasundarI, nityA, nIlapatAkinI, vijayA,
sarvamangalA, jvAlAmAlinI, chitrA and tripurasundarI).
392. శ్రీకంఠార్థశరీరిణీ –శివుని సగము శరీరముగా నున్నది. She who
possesses half of the body of shrIkaNTha (shiva). She who is in the
form of ardhanArishvara.
ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ |
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాஉవ్యక్త స్వరూపిణీ || 86 ||
393. ప్రభావతీ –వెలుగులు విరజిమ్ము రూపము గలది. She who is effulgent.
394. ప్రభారూపా –వెలుగుల యొక్క రూపము. She who is effulgence.
395. ప్రసిద్ధా –ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది. She who is celebrated.
396. పరమేశ్వరీ –పరమునకు అధికారిణి. She who is the supreme sovereign.
397. మూలప్రకృతిః –అన్ని ప్రకృతులకు మూలమైనది. She who is the first
cause of the entire universe.
398. అవ్యక్తా –వ్యక్తము కానిది. She who is unmanifested.
399. వ్యక్తావ్యక్తస్వరూపిణీ –వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క
స్వరూపముగా నున్నది. She who is in the manifested and unmanifested
forms.
వ్యాపినీ, వివిధాకారా, విద్యాஉవిద్యా స్వరూపిణీ |
మహాకామేశ నయనా, కుముదాహ్లాద కౌముదీ || 87 ||
400. వ్యాపినీ –వ్యాపనత్వ లక్షణము కలది. She who is all-pervading.
401. వివిధాకారా –వివిధములైన ఆకారములతో నుండునది. She who has a
multitude of forms.
402. విద్యాఽవిద్యాస్వరూపిణీ –విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు
సంబంధించిన భాగమును తన రూపముగా గలది. She who is the form of both
knowledge and ignorance.
403. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ –మహాకామేశ్వరుని కన్నులనెడు
కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ. She who is the
moonlight that gladdens the water-lilies that are mahAkAmesha's eyes.
భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః |
శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ || 88 ||
404. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః –భక్తుల హృదయగతమైన అంధకార
అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము. She who is the
sunbeam which dispels the darkness from the heart of Her devotees.
405. శివదూతీ –శివుని వద్దకు పంపిన దూతిక. She for whom shiva is the
messenger; She who is shiva's messenger.
406. శివారాధ్యా –శివునిచే ఆరాధింపబడునది. She who is worshipped by
shiva.
407. శివమూర్తిః –శివుని యొక్క స్వరూపము. She whose form is shiva
Himself.
408. శివంకరీ –శుభములు చేకూర్చునది. She who confers prosperity
(auspiciousness, happiness). She who turns Her devotees into shiva.
శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా |
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా || 89 ||
409. శివప్రియా –శివునికి ఇష్టమైనది. She who is beloved of shiva.
410. శివపరా –శివుని పరమావధిగా కలిగినది. She who is solely devoted to
shiva.
411. శిష్టేష్టా –శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది. She who
is loved by the righteous; She who is the chosen deity of devotees;
She who loves righteous people.
412. శిష్టపూజితా –శిష్టజనుల చేత పూజింపబడునది. She who is always
worshipped by the righteous.
413. అప్రమేయా –ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది. She who is
immeasurable by the senses.
414. స్వప్రకాశా –తనంతట తానే ప్రకాశించునది. She who is self-luminous.
415. మనోవాచామగోచరా –మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప
వీలుకానిది. She who is beyond the range of mind and speech.
చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా |
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా || 90 ||
416. చిచ్ఛక్తిః –చైతన్య శక్తి. She who is the power of consciousness.
417. చేతనారూపా –చలించు తెలివి యొక్క రూపము. She who is pure
consciousness.
418. జడశక్తిః –ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి. She who is the
mAyA that has transformed itself as the power of creation.
419. జడాత్మికా –జడశక్తి యొక్క స్వరూపము. She who is in the form of the
inanimate world.
420. గాయత్రీ –గానము చేసిన వారిని రక్షించునది. She who is the gAyatrI
mantra.
421. వ్యాహృతిః –ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది. She who is in the
nature of utterance; She who presides over the power of speech.
422. సంధ్యా –చక్కగా ధ్యానము చేయబడునది. She who is in the form of
twilight.
423. ద్విజబృంద నిషేవితా –ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది. She who
is worshipped by the twice-born.
తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ || 91 ||
424. తత్త్వాసనా –తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది. She who has tattvas
as Her seat; She who abides in tattva.
425. తత్ –ఆ పరమాత్మను సూచించు పదము. She who is meant by 'That', the
supreme truth, brahman.
426. త్వమ్ – నీవు. She who is referred to, by 'Thou'.
427. అయీ –అమ్మవారిని సంబోధించు పదము. Oh, Mother!
428. పంచకోశాంతరస్థితా –ఐదు కోశముల మధ్యన ఉండునది. She who resides
within the five sheaths.
429. నిస్సీమ మహిమా –హద్దులు లేని మహిమ గలది. She whose glory is
limitless.
430. నిత్యయౌవనా –సర్వకాలములందును యవ్వన దశలో నుండునది. She who is ever
youthful.
431. మదశాలినీ –పరవశత్వముతో కూడిన శీలము కలది. She who is shining in a
state of inebriation or intoxication.
మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః |
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా || 92 ||
432. మదఘూర్ణితరక్తాక్షీ –పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన
కన్నులు గలది. She whose eyes are reddened, rolling with rapture and
inward-looking.
433. మదపాటల గండభూః –ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో
ప్రకాంశించు చెక్కిళ్లు కలది. She whose cheeks are rosy with rapture.
434. చందనద్రవదిగ్ధాంగీ –మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది. She
whose body is smeared with sandalwood paste.
435. చంపేయకుసుమప్రియా –సంపెంగ పుష్పములందు ప్రీతి కలది. She who is
especially fond of champaka flowers.
కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ |
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా || 93 ||
436. కుశలా –క్షేమము, కౌశల్యమును గలది. She who is skillful.
437. కోమలాకారా –సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది. She who is
graceful in form.
438. కురుకుల్లా – ఆమె శక్తి, కురుకుల్లా (కురువింద కెంపు (ముదురు
ఎరుపురంగు) లో నివసిస్తుంది). She who is the shakti, kurukullA
(residing in kuruvindA ruby).
439. కులేశ్వరీ –కులమార్గమునకు ఈశ్వరి. She who is the ruler of kula
(the triad of knower, the known and knowledge).
440. కులకుండలయా – కులకుండమును నిలయముగా గలది. She who abides in the
kulakuNDa (the bindu at the center of the pericarp in mUlAdhAra
chakra.
441. కౌలమార్గతత్పరసేవితా - కౌల సంప్రదాయానికి అంకితమైన వారిచే
పూజింపబడేది. She who is worshipped by those devoted to the kaula
tradition.
కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః |
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ || 94 ||
442. కుమార గణనాథాంబా –కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది. She who is
the mother of kumara (subrahmanya) and gaNanAtha (GaNapathi).
443. తుష్టిః –తృప్తి, సంతోషముల రూపము. She who is ever content.
444. పుష్టిః –సమృద్ధి స్వరూపము. She who is the power of nourishment.
445. మతిః – బుద్ధి. She who manifests as intelligence.
446. ధృతిః – ధైర్యము. She who is fortitude.
447. శాంతిః –తొట్రుపాటు లేని నిలకడతనము గలది. She who is tranquility
itself.
448. స్వస్తిమతీ –మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
She who is the ultimate truth.
449. కాంతిః – కోరదగినది. She who is effulgence.
450. నందినీ – ఆనందిని అంటే ఆనందమును ఇచ్చునది. She who gives delight.
451. విఘ్ననాశినీ – విఘ్నములను నాశము చేయునది. She who destroys all
obstacles.
తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ |
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ || 95 ||
452. తేజోవతీ –తేజస్సు కలది. She who is effulgent.
453. త్రినయనా –మూడు కన్నులు కలది. She who has the sun, moon and fire
as Her three eyes.
454. లోలాక్షీ కామరూపిణీ –స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
లోలాక్షీ -She who has rolling eyes. separate name కామరూపిణీ - She
who is in the form of love in women.
455. మాలినీ –మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది. She who is
wearing garlands.
456. హంసినీ –హంసను (శ్వాసను) గలిగినది. She who is not separate from
hamsas (the yogins who have reached great spiritual heights).
457. మాతా – తల్లి. She who is the mother of the universe.
458. మలయాచలవాసినీ – మలయపర్వమున వసించునది. She who resides in the
malaya mountain.
సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా |
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ || 96 ||
459. సుముఖీ –మంగళకరమైన ముఖము కలది. She who has a beautiful face.
460. నళినీ –నాళము గలిగినది. She whose body is soft and beautiful
like lotus petals.
461. సుభ్రూః –శుభప్రధమైన కనుబొమలు కలిగినది. She who has beautiful
eyebrows.
462. శోభనా –సౌందర్యశోభ కలిగినది. She who is always radiant.
463. సురనాయికా –దేవతలకు నాయకురాలు. She who is the leader of the
gods.
464. కాలకంఠీ –నల్లని కంఠము గలది. She who is the wife of shiva.
465. కాంతిమతీ –ప్రకాశవంతమైన శరీరము కలది. She who is radiant.
466. క్షోభిణీ –క్షోభింపచేయునది అనగా మథించునది. She who creates
upheaval in the mind.
467. సూక్ష్మరూపిణీ –సూక్ష్మశక్తి స్వరూపిణి. She who has a form that
is too subtle to be perceived by the sense organs.
వజ్రేశ్వరీ, వామదేవీ, వయోஉవస్థా వివర్జితా |
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ || 97 ||
468. వజ్రేశ్వరీ –వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి. She who is
vajreshvarI, the sixth daily deity.
469. వామదేవీ –అందముగా నున్న దేవత. She who is the wife of vAma deva
(shiva).
470. వయోవస్థావివర్జితా –వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం
గాని లేనిది. She who is exempt from changes due to age (time).
471. సిద్ధేశ్వరీ –సిద్ధులకు అధికారిణి. She who is the goddess
worshipped by spiritual adepts.
472. సిద్ధవిద్యా –సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి. She who is in
the form of siddhavidyA, the fifteen-syllabled mantra.
473. సిద్ధమాతా –సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది. She who is the
mother of siddhas.
474. యశస్వినీ –యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. She who is of
unequalled renown.
విశుద్ధి చక్రనిలయా,உஉరక్తవర్ణా, త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా || 98 ||
475. విశుద్ధి చక్రనిలయా –విశుద్ధి చక్రములో వసించునది. She who
resides in the vishuddhi chakra.
476. ఆరక్తవర్ణా –రక్తవర్ణములో నుండునది. She who is of slightly red
(rosy) complexion.
477. త్రిలోచనా –మూడు లోచనములు కలది. She who has three eyes.
478. ఖట్వంగాది ప్రహరణా –ఖట్వాంగాది ఆయుధములు ధరించునది. She who is
armed with a club and other weapons.
479. వదనైక సమన్వితా –ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది. She who
possesses only one face.
పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ |
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ || 99 ||
480. పాయసాన్న ప్రియా –పాయసాన్నములో ప్రీతి గలది. She who is
especially fond of sweet rice.
481. త్వక్ స్థా –చర్మధాతువును ఆశ్రయించి ఉండునది. She who is the
deity of the organ of touch (skin).
482. పశులోక భయంకరీ –పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది. She who fills
with fear the mortal beings bound by worldly existence.
483. అమృతాది మహాశక్తి సంవృతా –అమృతా మొదలైన మహాశక్తులచేత
పరివేష్టింపబడి యుండునది. She who is surrounded by amRitA and other
shakti deities.
484. ఢాకినీశ్వరీ –ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత. She
who is the DAkinI deity
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలా,உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా || 100 ||
485. అనాహతాబ్జ నిలయా –అనాహత పద్మములో వసించునది. She who resides in
the anAhata lotus in the heart.
486. శ్యామభా –శ్యామల వర్ణములో వెలుగొందునది. She who is black in
complexion.
487. వదనద్వయా –రెండు వదనములు కలది. She who has two faces.
488. దంష్ట్రోజ్వలా –కోరలతో ప్రకాశించునది. She who has shining tusks.
489. అక్ష్మమాలాదిధరా –అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది. She who
is wearing garlands of rudrAkSha beads and other things.
490. రుధిర సంస్థితా –రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది. She who
presides over the blood in the bodies of living beings.
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ || 101 ||
491. కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా –కాళరాత్రి మొదలైన పన్నెండి మంది
శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది. She who is surrounded by
kAlarAtri and other shaktis.
492. స్నిగ్థౌదన ప్రియా –నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది. She who
is fond of food offerings containing ghee, oil and other substances
containing fats.
493. మహావీరేంద్ర వరదా –శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ
సమకూర్చునది. She who bestows boons on great warriors.
494. రాకిణ్యంబా స్వరూపిణీ –రాకిణీ దేవతా స్వరూపిణి. She who is in the
form of the rAkiNi deity.
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా |
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా || 102 ||
495. మణిపూరాబ్జనిలయా –మణిపూర పద్మములో వసించునది. She who resides in
the ten-petaled lotus in the maNipUraka chakra.
496. వదనత్రయ సంయుతా –మూడు ముఖములతో కూడి యుండునది. She who has three
faces.
497. వజ్రాదికాయుధోపేతా –వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. She
who holds the vajra (lightning bolt) and other weapons.
498. డామర్యాదిభిరావృతా –డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే
పరివేష్టింపబడి యుండునది. She who is surrounded by DAmarI and other
attending deities.
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా |
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ || 103 ||
499. రక్తవర్ణా –ఎర్రని రక్త వర్ణంలో ఉండునది. She who is red in
complexion.
500. మాంసనిష్ఠా –మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది. She who presides
over the flesh in living beings.
501. గుడాన్నప్రీతమానసా –గుడాన్నములో ప్రీతి కలది. She who is fond of
sweet rice made with raw sugar.
502. సమస్త భక్త సుఖదా –అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను
ప్రసాదించునది. She who confers happiness on all Her devotees.
503. లాకిన్యంబా స్వరూపిణీ – లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా |
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,உతిగర్వితా || 104 ||
504. స్వాధిష్ఠానాంబుజగతా –స్వాధిష్ఠాన పద్మములో వసించునది. She who
resides in the six-petaled lotus in the svAdhiShTAna, kAkinI yoginI.
505. చతుర్వక్త్రమనోహరా –నాలుగు వదనములతో అందముగా నుండునది. She who
has four beautiful faces.
506. శూలాధ్యాయుధ సంపన్నా –శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది. She
who possesses the trident and other weapons (i.e., noose, skull and
abhaya).
507. పీతవర్ణా – పసుపు పచ్చని రంగులో ఉండునది. She who is yellow in
color.
508. అతిగర్వితా –మిక్కిలి గర్వంతో నుండునది. She who is very proud.
మేదోనిష్ఠా, మధుప్రీతా, బంధిన్యాది సమన్వితా |
దధ్యన్నాసక్త హృదయా, డాకినీ రూపధారిణీ || 105 ||
509. మేదోనిష్ఠా – మేదస్సు ధాతువును ఆశ్రయించి యుండునది. She who
resides in the fat in living beings.
510. మధుప్రీతా – మధువులో ప్రీతి కలిగినది. She who is fond of honey
and other offerings made with honey.
511. బంధిన్యాది సమన్వితా – బందినీ మొదలైన పరివార దేవతలచే
పరివేష్టింపబడి ఉండునది. She who is accompanied by bandhini and other
shaktis.
512. దధ్యన్నాసక్త హృదయా – పెరుగు అన్నం ఇష్టపడునది. She who is
particularly fond of offerings made with curd.
513. కాకినీ రూపధారిణీ – కాకినీ పేరుగల దేవతగా రూపమును ధరించి ఉండునది.
She who is in the form of kAkinI yoginI.
మూలాధారాంబుజారూఢా, పంచవక్త్రా,உస్థిసంస్థితా |
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా || 106 ||
514. మూలాధారాంభుజారూఢా – మూలాధార పద్మములో అధివసించునది. She who is
resident in the lotus in the mUlAdhAra.
515. పంచ వక్త్రా – ఐదు ముఖములతో నుండునది. She who has five faces.
516. అస్థి సంస్థితా – ఎముకలను ఆశ్రయించి ఉండునది. She who resides in
the bones.
517. అంకుశాది ప్రహరణా – అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది. She
who holds the goad and other weapons.
518. వరదాది నిషేవితా – వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే
సేవింపబడునది. She who is attended by varadA and other shaktis.
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ |
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా || 107 ||
519. ముద్గౌదనాసక్తచిత్తా – పులగములో ప్రీతి కలది. She who is
particularly fond of food offerings made of mudga, a lentil.
520. సాకిన్యంబా స్వరూపిణీ – సాకినీ దేవతా స్వరూపముగా నుండునది. She
who is in the form of sAkinI yoginI.
521. ఆజ్ఞా చక్రాబ్జనిలయా – ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది. She who
resides in the two-petaled lotus in the AjnAchakra.
522. శుక్లవర్ణా – తెలుపురంగులో ఉండునది. She who is white in color.
523. షడాసనా – ఆరు ముఖములు కలది. She who has six faces.
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ || 108 ||
524. మజ్జా సంస్థా –మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది. She who is the
presiding deity of the bone marrow.
525. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా –హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో
కూడి ఉండునది. She who is accompanied by the shaktis hamsavatI and
kShamAvati (in the two petals of the lotus).
526. హరిద్రాన్నైక రసికా –పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది. She
who is fond of food seasoned with turmeric.
527. హాకినీ రూపధారిణీ –హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది. She who
is in the form of hAkinI devI.
సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ || 109 ||
528. సహస్రదలపద్మస్థా - వేయి రేకుల కమలంలో నివసించేది. She who resides
in the thousand-petaled lotus.
529. సర్వవర్ణోపశోభితా - అనేక వర్ణాలలో ప్రకాశించేది. She who is
radiant in many colors.
530. సర్వాయుధధరా - తెలిసిన అన్ని ఆయుధాలు ఆమె కలిగి ఉంది. She who
holds all the known weapons.
531. శుక్లసంస్థితా - వీర్యంలో నివసించేది. She who resides in the
semen
532. సర్వతోముఖీ - ఆమె ముఖాలు నలువైపులా తిరిగింది. She who has faces
turned in all directions.
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా, స్వధా,உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా || 110
||
533. సర్వౌదన ప్రీత చిత్తా –అన్ని రకముల ఆహారమును ప్రీతితో
స్వీకరించునది. She who is pleased by all offerings of food.
534. యాకిన్యంబా స్వరూపిణీ –యాకినీ దేవతా స్వరూపములో ఉండునది. She who
is in the form of the yAkinI yoginI.
535. స్వాహా –చక్కగా ఆహ్వానించునది. She who is the object of the
invocation 'svAhA' at the end of mantras chanted while offering
oblations to the fire in yAga ceremonies.
536. స్వధా –శరీర ధారణ ప్రక్తియకు సంబంధించిన స్వాగత వచనము. She who is
the object of the 'svadhA' invocation at the end of mantras.
537. అమతిః –మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని
సూచించు శక్తి. She who is in the form of ignorance or nescience.
538. మేధా –ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. She who is in the form
of wisdom (knowledge).
539. శ్రుతిః –చెవులతో సంబంధము కలిగినది. She who is in the form of
the vedas.
540. స్మృతిః –మరల మరల గుర్తుకు తెచ్చుకొను లక్షణము. She who is in the
form of smRiti (works based on the meaning of vedas).
541. అనుత్తమా –తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేనిది. She who is the
best; She who is not excelled by anyone.
పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా || 111 ||
542. పుణ్యకీర్తి –మంచి లేదా పవిత్రమైన యశస్సు కలది. She whose fame is
sacred or righteous.
543. పుణ్యలభ్యా –సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడునది.
She who is attained only by righteous souls.
544. పుణ్య శ్రవణ కీర్తనా –పుణ్యప్రథమైన వాక్కులను వినుటకు, కీర్తనము
చేయుటకు అవకాశము కలుగజేయునది. She who bestows merit on anyone who
hears of Her and praises Her.
545. పులోమజార్చితా –పులోముని కూతురైన శచీదేవిచే ఆరాధింపబడింది. She
who is worshipped by pulomaja (Indra's wife).
546. బంధమోచనీ –అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయునది. She who
is free from bonds; She who gives release from bondage.
547. బంధురాలకా –అందమైన చిక్కనైన ముంగురులు కలది. She who has wavy
locks of hair.
విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ || 112 ||
548. విమర్శరూపిణీ –జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.
She who is in the form of vimarsha (reflection or meaning).
549. విద్యా –జ్ఞాన రూపిణి. She who is in the form of knowledge.
550. వియదాది జగత్ప్రసూ –ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును
సృజించునది. She who is the Mother of the universe, which is the
aggregate of all the elements starting with the ether.
551. సర్వవ్యాధి ప్రశమనీ –అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము
కలుగజేయునది. She who removes all diseases and sorrows.
552. సర్వమృత్యు నివారిణీ –సకల మృత్యుభయాలను పోగొట్టునది. She who
guards Her devotees from all.
అగ్రగణ్యా,உచింత్యరూపా, కలికల్మష నాశినీ |
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా || 113 ||
553. అగ్రగణ్యా – దేవతలందరిలో ముందుగా గణింపబడేది. She who is to be
considered the foremost.
554. అచింత్యరూపా – చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవికానిది. She who
is of a form beyond the reach of thought.
555. కలికల్మషనాశినీ – కలియుగ మలినములను పోగొట్టునది. She who is the
destroyer of the sins of the age of kali.
556. కాత్యాయనీ – కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగింది. She who is the
daughter of a sage named kata.
557. కాలహంత్రీ – కాలమును హరించునది. She who is the destroyer of
time (death).
558. కమలాక్ష నిషేవితా – విష్ణుమూర్తిచే నిశ్శేషంగా సేవింపబడునది.
She in whom viShNu takes refuge.
తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా |
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ || 114 ||
559. తాంబూల పూరితముఖీ – తాంబూలము చేత నిండి పండిన నోరు కలది. She
whose mouth is full from chewing betel.
560. దాడిమీ కుసుమప్రభా – దానిమ్మపువ్వు ప్రభతో విరాజిల్లునది. She
who shines like a pomegranate flower.
561. మృగాక్షీ – ఆడలేడి కన్నులకు ఉండే లక్షణాలుగల కళ్ళు కలది. She
whose eyes are long and beautiful like those of a doe.
562. మోహినీ – మోహనమును కలుగజేయునది. She who is enchanting.
563. ముఖ్యా – ముఖ్యురాలు. She who is the first.
564. మృడానీ – మృడుని పత్ని. She who is the wife of mRiDa (shiva).
565. మిత్రరూపిణీ – మిత్రుడని పిలువబడే సూర్యుని రూపముగా ఉంది. She
who is the friend of everyone (universe).
నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ |
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ || 115 ||
566. నిత్యతృప్తా – నిత్యసంతుష్టి స్వభావము కలది. She who is
eternally contented.
567. భక్తనిధిః – భక్తులకు నిధి వంటిది. She who is the treasure of
the devotees.
568. నియంత్రీ – సర్వమును నియమించునది. She who controls and guides
all beings on the right path.
569. నిఖిలేశ్వరీ – సమస్తమునకు ఈశ్వరి. She who is the ruler of all
570. మైత్ర్యాది వాసనాలభ్యా – మైత్రి మొదలైన వాసనా చతుష్టయము
గలవారిచే పొందబడునది. She who is to be attained by love and other
good dispositions.
571. మహాప్రళయ సాక్షిణీ – మహాప్రళయ స్థితియందు సాక్షి భూతురాలుగా
ఉండునది. She who is witness to the great dissolution.
పరాశక్తిః, పరానిష్ఠా, ప్రఙ్ఞాన ఘనరూపిణీ |
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ || 116 ||
572. పరాశక్తిః – అన్ని శక్తులకు అతీతంగా ఉండి, వాటన్నిటికీ
నేపథ్యంలో వర్తించే శక్తి. She who is the original, supreme power.
573. పరానిష్ఠా – సర్వాంతర్యామిని సర్వమునందు చూడగలుగు నిష్ఠను
సూచించునది. She who is the supreme end, the supreme abidance.
574. ప్రజ్ఞాన ఘనరూపిణీ – ఘనరూపం దాల్చిన ప్రజ్ఞానం. She who is
pure, condensed knowledge.
575. మాధ్వీపానాలసా – మధుసంబంధిత పానము వలన అలసత్వము చెందినది. She
who is languid from drinking wine; She who is not eager for
anything.
576. మత్తా – నిత్యము పరవశత్వములో ఉండునది. She who is intoxicated.
577. మాతృకావర్ణరూపిణీ – అన్ని రంగులకు తల్లివంటి రంగు యొక్క రూపంలో
/ అన్నీ అక్షరముల యొక్క మాతృకలలో ఉండునది. She who is in the form of
the letters of the alphabet.
మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా |
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ || 117 ||
578. మహాకైలాస నిలయా – గొప్పదైన కైలసమే నిలయముగా గలది. She who
resides in the great kailAsa.
579. మృణాల మృదుదోర్లతా – తామరతూడులవంటి మృదువైన బాహువులు గలది. She
whose arms are as soft and cool as the lotus stem.
580. మహనీయా – గొప్పగా ఆరాధింపబడునది. She who is adorable.
581. దయామూర్తిః – మూర్తీభవించిన దయాలక్షణము గలది. She who is the
personification of compassion.
582. మహాసామ్రాజ్యశాలినీ – పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వసామ్రాజ్యమునకు
అధినాయకురాలు. She who controls the great empire of the three
worlds.
ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా |
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా || 118 ||
583. ఆత్మవిద్యా – ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. She who is
the knowledge of the self.
584. మహావిద్యా – గొప్పదైన విద్యా స్వరూపురాలు. She who is the seat
of exalted knowledge, the knowledge of the self.
585. శ్రీవిద్యా – శ్రీ విద్యా స్వరూపిణి. She who is sacred
knowledge (pa~nchadashi mantra).
586. కామసేవితా – కాముని చేత సేవింపబడునది. She who is worshipped by
kAmadeva.
587. శ్రీ షోడశాక్షరీ విద్యా – సకల మంగళప్రదమైన పదహారు అక్షరాల
మంత్రమునకు సంబంధించిన విద్యాస్వరూపిణి. She who is in the form of
the sixteen-syllabled mantra.
588. త్రికూటా – మూడు కూటములుగా ఉన్న మంత్ర స్వరూపిణి. She who is in
the three parts (of pa~nchadashI mantra).
589. కామకోటికా – కామమునకు పై అంచునగలదాని స్వరూపిణి. She, of whom
kAma (shiva) is a part or an approximate form.
కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా |
శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా || 119 ||
590. కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా – అనుగ్రహ వీక్షణ మాత్రముచే
భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది. She who is
attended by millions of lakShmis who are subdued by Hern mere
glances.
591. శిరఃస్థితా – తలమిద పెట్టుకోవలసినది. She who resides in the
head.
592. చంద్రనిభా – చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.
She who is resplendent like the moon.
593. ఫాలస్థా – ఫాల భాగమునందు ఉండునది. She who resides in the
forehead (between the eyebrows).
594. ఇంద్రధనుఃప్రభా – ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు
కాంతులతో వెలుగొందునది. She who is resplendent like the rainbow.
హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా |
దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయఙ్ఞ వినాశినీ || 120 ||
595. హృదయస్థా – హృదయమునందు ఉండునది. She who resides in the heart.
596. రవిప్రఖ్యా – సూర్యునితో సమానమైన కాంతితో వెలుగొందునది. She who
shines with the special brilliance of the sun.
597. త్రికోణాంతర దీపికా – మూడు బిందువులతో ఏర్పడు త్రిభుజము యొక్క
మద్యమున వెలుగుచుండునది. She who shines as a light within the
triangle.
598. దాక్షాయణీ – దక్షుని కుమార్తె. She who is satIdevI, the
daughter of dakSha prajApati.
599. దైత్యహంత్రీ – రాక్షసులను సంహరించింది. She who is the killer
of demons.
600. దక్షయజ్ఞవినాశినీ – దక్షయజ్ఞమును నాశము చేసినది. She who is the
destroyer of the sacrifice conducted by dakSha.
దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః || 121 ||
601. దరాందోళితదీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన
కన్నులు గలది. She who has long, tremulous eyes.
602. దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. She
whose face is radiant with a smile.
603. గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది. She who has
assumed a severe form or one who has assumed the form of the guru.
604. గుణనిధిః – గుణములకు గని వంటిది. She who is the treasure house
of all good qualities.
605. గోమాతా – గోవులకు తల్లి వంటిది. She who became surabhI, the
cow that grants all wishes.
606. గుహజన్మభూః – కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది. She who is
the mother of guhA (subramaNya).
దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా || 122 ||
607. దేవేశీ – దేవతలకు పాలకురాలు. She who is the protector of the
gods.
608. దండనీతిస్థా – దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది. She
who maintains the rules of jusstice without the slightest error.
609. దహరాకాశరూపిణి – హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది. She who is
the subtle self in the heart.
610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా – పాడ్యమి నుండి ముఖ్యమైన
పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది. She who is worshipped
daily starting with pratipad (first day of the lunar half-month)
and ending with the full moon.
దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ |
గురుమూర్తి, ర్గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః || 121 ||
601. దరాందోళితదీర్ఘాక్షీ – కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన
కన్నులు గలది. She who has long, tremulous eyes.
602. దరహాసోజ్జ్వలన్ముఖీ – మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. She
whose face is radiant with a smile.
603. గురుమూర్తిః – గురువు యొక్క రూపముగా నున్నది. She who has assumed
a severe form or one who has assumed the form of the guru.
604. గుణనిధిః – గుణములకు గని వంటిది. She who is the treasure house
of all good qualities.
605. గోమాతా – గోవులకు తల్లి వంటిది. She who became surabhI, the cow
that grants all wishes.
606. గుహజన్మభూః – కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది. She who is the
mother of guhA (subramaNya).
దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ |
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా || 122 ||
607. దేవేశీ – దేవతలకు పాలకురాలు. She who is the protector of the
gods.
608. దండనీతిస్థా – దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది. She
who maintains the rules of jusstice without the slightest error.
609. దహరాకాశరూపిణి – హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది. She who is
the subtle self in the heart.
610. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజితా – పాడ్యమి నుండి ముఖ్యమైన
పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది. She who is worshipped
daily starting with pratipad (first day of the lunar half-month) and
ending with the full moon.
కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా || 123 ||
611. కలాత్మికా – కళల యొక్క రూపమైనది. She who is in the form of the
kalAs.
612. కలానాథా – కళలకు అధినాథురాలు. She who is the mistress of all the
kalAs.
613. కావ్యాలాపవినోదినీ – కావ్యముల ఆలాపములో వినోదించునది. She who
delights in hearing poetry.
614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా – వింజామరలను కలిగియున్న
ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత
సేవింపబడునది. She who is attended by lakShmI on the left side and
sarasvatI on the right side, bearing ceremonial fans.
ఆదిశక్తి, రమేయా,உஉత్మా, పరమా, పావనాకృతిః |
అనేకకోటి బ్రహ్మాండ జననీ, దివ్యవిగ్రహా || 124 ||
615. ఆదిశక్తిః – ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి. She who is the
primordial power, the parAshakti who is the cause of the universe
616. అమేయా – కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని
అలవికానిది. She who is not measurable by any means.
617. ఆత్మా – ఆత్మ స్వరూపిణి. She who is the self in all.
618. పరమా – సర్వీత్కృష్టమైనది. She who is the supreme.
619. పావనాకృతిః – పవిత్రమైన స్వరూపము గలది. She who is of sacred form
620. అనేకకోటి బ్రహ్మాండజననీ – అనంతమైన సమూహములుగా నుండు
బ్రహ్మాండములకు తల్లి. She who is the creator of many crores of
worlds.
621. దివ్యవిగ్రహా – వెలుగుచుండు రూపము గలది. She who has a divine
body.
క్లీంకారీ, కేవలా, గుహ్యా, కైవల్య పదదాయినీ |
త్రిపురా, త్రిజగద్వంద్యా, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరీ || 125 ||
622. క్లీంకారీ – ‘క్లీం’ అను బీజాక్షరమునకు కారణభూతురాలు. She who is
creator of the syllable 'klIM'.
623. కేవలా – ఒకే ఒక తత్వమును సూచించునది. She who is the absolute, as
She is complete, independent and without any attributes.
624. గుహ్యా – రహస్యాతి రహస్యమైనది. She who is to be known in secret.
625. కైవల్యపదదాయినీ – మోక్షస్థితిని ఇచ్చునది. She who bestows
liberation.
626. త్రిపురా – మూడు పురములను కలిగి ఉంది. She who is older than the
three (trinity of brahmA viShNu and shiva).
627. త్రిజగద్వంద్యా – మూడు లోకములచే పూజింపబడునది. She who is adored
by the inhabitants of all three worlds.
628. త్రిమూర్తిః – త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో
ఉండునది. She who is the aggregate of the trinity (brahmA, viShNu and
shiva).
629. త్రిదశేశ్వరీ – దేవతలకు ఈశ్వరి. She who is the ruler of the
gods.
త్ర్యక్షరీ, దివ్యగంధాఢ్యా, సింధూర తిలకాంచితా |
ఉమా, శైలేంద్రతనయా, గౌరీ, గంధర్వ సేవితా || 126 ||
630. త్ర్యక్షరీ – మూడు అక్షరముల స్వరూపిణి. She whose form consists
of three letters or syllables (Om = a u m).
631. దివ్యగంధాడ్యా – దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది. She
who is richly endowed with divine fragrance.
632. సిందూర తిలకాంచితా – పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది. She
who shines with a vermillion mark on Her forehead; She who is
decorated with a special paste made of vermilion.
633. ఉమా – ఉమా నామాన్వితురాలు. మూడు లోకములచే పూజింపబడునది. She who
is pArvatI devI.
634. శైలేంద్రతనయా – హిమవత్పర్వతము యొక్క కుమార్తె. She who is the
daughter of Himavat, the king of the mountains.
635. గౌరీ – గౌర వర్ణములో ఉండునది. She who has a fair complexion.
636. గంధర్వసేవితా – గంధర్వులచేత పూజింపబడునది. She who is served by
gandharvas (like vishvAvasu).
విశ్వగర్భా, స్వర్ణగర్భా,உవరదా వాగధీశ్వరీ |
ధ్యానగమ్యా,உపరిచ్ఛేద్యా, ఙ్ఞానదా, ఙ్ఞానవిగ్రహా || 127 ||
637. విశ్వగర్భా – విశ్వమును గర్భమునందు ధరించునది. She who contains
the whole universe in Her womb.
638. స్వర్ణగర్భా – బంగారు గర్భము గలది. She who is the cause of the
universe.
639. అవరదా – తనకు మించిన వరదాతలు లేనిది. She who destroys the
unholy.
640. వాగధీశ్వరీ – వాక్కునకు అధిదేవత. She who presides over speech.
641. ధ్యానగమ్యా – ధ్యానము చేత పొందబడునది. She who is to be attained
through meditation.
642. అపరిచ్ఛేద్యా – విభజింప వీలులేనిది. She whose limits cannot be
ascertained (unlimited).
643. జ్ఞానదా – జ్ఞానమును ఇచ్చునది. She who gives knowledge of the
self.
644. జ్ఞానవిగ్రహా – జ్ఞానమును మూర్తిగా దాల్చింది. She who is sthe
embodiment of knowledge itself.
సర్వవేదాంత సంవేద్యా, సత్యానంద స్వరూపిణీ |
లోపాముద్రార్చితా, లీలాక్లుప్త బ్రహ్మాండమండలా || 128 ||
645. సర్వవేదాంత సంవేద్యా – అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
She who is known by all of vedAnta.
646. సత్యానంద స్వరూపిణీ – నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది. She
whose form is existence and bliss.
647. లోపాముద్రార్చితా – లోపాముద్రచే అర్చింపబడింది. She who is
worshipped by lopAmudrA (wife of sage agastya).
648. లీలాక్లుప్త బ్రహ్మాండమండలా – క్రీడా వినోదానికై కల్పింపబడి
క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది. She who has created and
maintained the universe purely as a sport.
అదృశ్యా, దృశ్యరహితా, విఙ్ఞాత్రీ, వేద్యవర్జితా |
యోగినీ, యోగదా, యోగ్యా, యోగానందా, యుగంధరా || 129 ||
649. అదృశ్యా – చూడబడనిది. She who is not perceived by sense organs
(normal eyes).
650. దృశ్యరహితా – చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది. She who
has nothing to see.
651. విజ్ఞాత్రీ – విజ్ఞానమును కలిగించునది. She who knows the truth
of the physical universe.
652. వేద్యవర్జితా – తెలుసుకొన బడవలసినది ఏమీ లేనిది. She who has
nothing left to know.
653. యోగినీ – యోగముతో కూడి ఉంది. She who is constantly united with
parAshiva; She who possesses the power of yoga.
654. యోగదా – యోగమును ఇచ్చునది. She who bestows the power of yoga.
655. యోగ్యా – యోగ్యమైనది. She who deserves yoga of all kinds.
656. యోగానందా – యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి. She who is the
bliss attained through yoga; She who enjoys the bliss of yoga.
657. యుగంధరా – ఆమె యుగాలను భరించేది/ధరించునది. She who is the bearer
of the yugas.
Work in progress
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీహయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితా
రహస్యనామసాహస్ర స్తోత్రకథనం నామ ద్వితీయోఽధ్యాయః ||
References/Resources:
- https://sahiti.sodhini.com/sri-lalitha-sahasranama-stotram/
- https://sanskritdocuments.org/doc_devii/lalita1000.html
No comments:
Post a Comment