కళ్యాణ వృష్టి స్తవం
by Jagadguru Shri Adi Shankaracharya
కళ్యాణ వృష్టి స్తవం
ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించిన లక్ష్మీదేవి మన ఇంట చిరస్థాయిగా ఉండును సరస్వతి దేవి కూడా ప్రసన్నురాలై చిరాయువును కలిగించును
ఈ అనంతమైన విశ్వాన్ని ’లక్షించేది’ లక్ష్మి.
అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ’కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి - అని భావార్థం.
కనులు తెరవడాన్ని సృష్తిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి స్థితి లయలే ’ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు.
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ’లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు.
ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ’లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి.
భృగు ప్రజాపతి, ఖ్యాతి దంపతులకు పరాశక్తి మహాలక్ష్మిగా ఆవిర్భవించింది. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ’భృగు’వారమనీ వ్యవహరిస్తారు.
భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు (హిమవాన్)పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణుదయనే ఆయాలోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు.
స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు. శాస్త్రాలు ప్రస్తావించిన సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి - ఒకే లక్ష్మి తాలూకు విభిన్న రూపాలివి.
’వర’ శబ్దానికి ’కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం.
కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం.
అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో మిగిలిన అయిదు లక్ష్ములనూ సమన్వయించి చరమ నామంగా చెబుతారు.
"ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటున్నది" అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం - కల్యాణవృష్టిస్తవః.
ఈ స్తోత్రమును ప్రతిరోజు పఠించిన లక్ష్మీదేవి మన ఇంట చిరస్థాయిగా ఉండును సరస్వతి దేవి కూడా ప్రసన్నురాలై చిరాయువును కలిగించును.
కళ్యాణవృష్టి స్తవః
Shloka 1
కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి- -ర్లక్ష్మీస్వయంవరణమంగలదీపికాభిః | సేవాభిరంబ తవ పాదసరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్ || ౧ ||Hey mother, which wishes in their mind,
Are not fulfilled of those lucky people,
Who are able to serve near your lotus like feet,
Which are the rains of luck full of nectar,
And which are like the lamps lit during,
The marriage of Goddess Lakshmi.
Shloka 2
ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే |
సాంనిధ్యముద్యదరుణాయుతసోదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య || ౨ ||
Oh Mother, while I salute you,
My eyes hidden by the tears of joy,
And Your form as pretty as fully opened lotus,
Drenched with the great joy of nectar,
Comes before the devotee,
And both these are greatly desirable.
Shloka 3
ఈశత్వనామకలుషాః కతి వా న సంతి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః | ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి || ౩ ||There are many so called Gods in the world,
For even Brahma and others are attacked by deluge always,
But the one who falls at your feet even once,
Stays on permanently without destruction.
ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునో ఓ జననీ! వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.
Shloka 4
లబ్ధ్వా సకృత్త్రిపురసుందరి తావకీనం కారుణ్యకందలితకాంతిభరం కటాక్షమ్ | కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః సంమోహయంతి తరుణీర్భువనత్రయేఽపి || ౪ ||Oh beauty of the three cities, if your side long glance,
Drenched in the enhanced light of your mercy,
Falls on one devotee even once,
They would be as lucky as the god of love,
And they easily attract all lasses of the three worlds.
ఓ త్రిపురసుందరీ! కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కోటి మన్మథసమానులై ముల్లోకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.
Shloka 5
హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదా మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే | త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః || ౫ ||Oh mother who lives in the triangle,
Who lives in the three cities of micro, macro and causal body,
Who has three eyes,
The Vedas tell that your name is the sound "Hreem",
And thine perennial devotees do not have,
The fear from the soldiers of death,
And they enjoy their stay in the holy garden,
With those who take care of the world.
త్రికోణము నందు నివసించు ఓ తల్లీ! త్రిపుర సుందరీ! మూడు కన్నులు ఉన్న దానా! నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లోకపాలులతో క్రీడించుచున్నారు.
Shloka 6
హంతుః పురామధిగలం పరిపీయమానః క్రూరః కథం న భవితా గరలస్య వేగః | నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య || ౬ ||Oh mother, the spread of the poison drunk by Lord Shiva,
Would not have stopped at his neck but for your.
Body which is always cold due to the ever drenching nectar,
Always occupying half of His body.
Shloka 7
సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే దేవి త్వదంఘ్రిసరసీరుహయోః ప్రణామః | కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి || ౭ ||Hey Goddess, a salute at thine lotus like feet,
Makes one all knowing in an assembly,
Creates in him mastery over words,
And not only that gives him a glittering crown,
Two fans at his side and very broad country to rule.
Shloka 8
కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు కారుణ్యవారిధిభిరంబ భవాత్కటాక్షైః | ఆలోకయ త్రిపురసుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్ || ౮ ||Hey mother, Who is the beauty of the three worlds,
You who have side long glances, which are the sea of mercy,
And the wish giving tree in fulfilling one's wishes,
Please see with those divine eyes,
Me who is an orphan and full of devotion to you,
And also tied to you with ecstasic love towards you.
Shloka 9
హంతేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే భక్తిం వహంతి కిల పామరదైవతేషు | త్వామేవ దేవి మనసా సమనుస్మరామి త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ || ౯ ||Oh mother, alas the ordinary people keep their mind
Towards very ordinary gods,
And carry devotion to them with them,
But I always meditate on you only,
And fall at your feet,
And you become my only source of protection.
Shloka 10
లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా- -మాలోకయ త్రిపురసుందరి మాం కదాచిత్ | నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం జాతో జనిష్యతి జనో న చ జాయతే వా || ౧౦ ||Hey beauty of the three cities, You would come across,
Many people to see, using your side long glances,
But at least once please make me an object of your sight,
For a suitable one like me for such a blessing was not there,
Is not there and will not be there.
ఓ త్రిపుర సుందరీ! నీ కటాక్షవీక్షణములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము. నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబోడు, పుట్టుట లేదు.
Shloka 11
హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే |
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః || ౧౧ ||
Hey, Goddess who lives in Tripura, to those,
Who chant daily "Hreem, Hreem"
What is there which cannot be attained?
They who should be presented with Garlands,
Crowns, respectability and vigorous elephants,
Would be served by Goddess of earth and Goddess of wealth.*
* They would wealthy and land owners.
Shloka 12
సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి | త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు నాన్యమ్ || ౧౨ ||Hey, goddess with eyes like the petals of lotus,
Salutations to you is capable of giving all wealth,
Giving happiness to all sense organs,
Giving as gift Countries to rule,
And giving solace from difficulties,
And so my mother, For ever make me blessed.
Shloka 13
కల్పోపసంహృతిషు కల్పితతాండవస్య దేవస్య ఖండపరశోః పరభైరవస్య | పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణా సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా || ౧౩ ||Victory to her who is armed with goad,
Rope, bow made of sugarcane,
And arrows made of flowers and who witnessed,
The vigorous manly dance of Shiva.
At the time of final deluge,
And also seen him as armed with axe,
And as a very angry furious Bhairava,
Shloka 14
లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం తేజః పరం బహులకుంకుమపంకశోణమ్ | భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్ || ౧౪ ||Oh, mother, my mind should always,
Be filled with the half that is you,
Which shines reddish like the bahula flowers
and large mixture of saffron,
Which wears the crown
swell as the nectar like crescent on its head
Which resides in the middle of the triangle,
And which is drenched with mercy of eternal joy.
Shloka 15
హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణంతి | త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః || ౧౫ ||Hey Goddess of the three cities, your name,
Is "Hreem" and that is your holy appearance,
And your devotees always chant your name,
Which is very difficult to obtain,
And the five bhoothas* which are made out of your power,
Grant a trouble free existence to that god who was born out of a lotus.
*air, earth, sky, wind and fire
Phalasruti Shloka
హ్రీంకారత్రయసంపుటేన మహతా మంత్రేణ సందీపితం స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మంత్రవిత్ | తస్య క్షోణిభుజో భవంతి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ వాణీ నిర్మలసూక్తిభారభారితా జాగర్తి దీర్ఘం వయః || ౧౬ ||To him who chants daily near you, this great mantra,
Which has "Hreem" in three places,
The king would become amenable,
The wealth would last for a long time,
The goddess of knowledge would grant clear thought and words,
And long life would be granted.
ఓ తల్లీ! మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వె!గొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు. లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును. చిరాయువు కలుగును.
Shubham Bhooyath, Shubham Bhooyath, Shubham Bhooyath
Let Good things happen,
Let Good things happen,
And let Good things happen.
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కల్యాణవృష్టి స్తవః|కల్యాణవృష్టిస్తవః సమ్పూర్ణః ॥
No comments:
Post a Comment