Wednesday, January 24, 2018

Humble Wish

My Humble Wish

May the Eternity be thy abode;
May the Nothingness be thy friend;
May the will of Cosmic Nature,
Be thy will
May the ever shining
Kutastha Consciousness,
that is present in thy brow,
shine forever in thee.
(Let thee be ever, in the awareness of that everlasting, eternal, infinite consciousness)


నా వినయపూర్వక అభీష్టము

అనంత తత్త్వమే నీ ధామముగా
శూన్యమే నీ సన్నిహితగా
ఆ మహా ప్రకృతి యొక్క
సంకల్పములే నీ కంకణాలుగా
(అనగా నీ సంకల్పములుగా)
నీ భృకుటి లో నున్న
నిత్యమూ జ్వాజ్వల్యమైయున్న
ఆ కూటస్థ చైతన్యమే
నీ యందు సదా ప్రకాశిస్తూ ఉండుగాక.
(ఆ అనంతమైన, నిత్యమైన
అనంత తత్త్వపు ఎరుకలో సదా ఉండుగాక.)

Saturday, January 13, 2018

సంక్రాంతి విశిష్టత - Specialty of sankranti,

సంక్రాంతి విశిష్టత

భగ భగ మండుతున్న మన తాపసాగ్ని అయినటువంటి భోగి మంటలలో మనకున్నటువంటి పంచ క్లేశములైనటువంటి అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, మరియు అభిమానములను వ్రేల్చి ఆభాస చైతన్యమైనటువంటి స్థూల భౌతిక ప్రకాశము నుండి, అనంతము, నిత్యము జ్వాజ్వల్యమానమైనటువంటి  ఆ అనంత చైతన్యము లోనికి సంక్రమణము జరిపి మానవుడి ప్రధానమైన జీవిత లక్ష్యమైనటువంటి ఆ భగవంతుని దివ్య ధామమును చేరుకొనుటకు, ఆ సర్వజ్ఞుడైన సర్వసాక్షి మనకు అందుకవసరమైనటువంటి ఆవరణమును ప్రసాదించుగాక అని సంక్రాంతిని జరుపుకొంటాము. ఇదియే సంక్రాంతి విశిష్టత.