Friday, November 17, 2017

జననము, మరణము మాయ యొక్క స్వరూపాలు మాత్రమే

జననము, మరణము మాయ యొక్క స్వరూపాలు మాత్రమే

ఎవరు జనించారు, ఏది జనించింది
ఎవరు మరణించారు, ఏది మరణించింది

ఏది జనించిందో, అది కణాల యొక్క సమూహం మాత్రమే

ఏదైతే జనించిందో, అది కణాల యొక్క సమూహము మాత్రమే అయితే ,
ఏది మరణించిందో లేక గతించిందో, అది కూడా కణాల యొక్క సమూహము మాత్రమే.

ఏది జనించిందో, అది కణాల యొక్క సమూహము మాత్రమే అయితే,
అప్పుడు అది కణాల యొక్క సమూహము మాత్రమే,
దానికి ఉనికి ఎన్నడూ లేదు

ఈ కణాల యొక్క సమూహానికి ఏ ఉనికీ లేనప్పుడు, అది పెంపొందించుకున్నటువంటి మరియు ఆపాదించుకున్నటువంటి గుర్తింపుల యొక్క ఉనికి నిజమా?

వాటి ఉనికి కూడా నిజాము కాదు.

అది పెంపొందించుకున్నటువంటి మరియు ఆపాదించుకున్నటువంటి గుర్తింపును తీసేసిననాడు అది కణాల యొక్క సమూహం మాత్రంగానే దృగ్గోచరమవుతున్నది.
దానికి నిజంగా ఉనికి లేనినాడు, దానికి ఉనికి ఉన్నట్టుగా ఎందుకనిపిస్తున్నది?
గుర్తింపు యొక్క ఉనికి ఎక్కడ ఉన్నది?
గుర్తింపు యొక్క ఉనికి నిజమా?

గుర్తింపు యొక్క ఉనికి ఆలోచన రూపంలో మాత్రమే ఉన్నది.

గుర్తింపు యొక్క ఉనికి ఆలోచన రూపంలో మాత్రమే ఉన్నట్లయితే,
అప్పుడు ఈ కణాల యొక్క సమూహానికి ఆలోచన మాత్రమే కారణం.

ఏ క్షణంలో అయితే ఆలోచన లేదో
ఆ క్షణంలో కణాల యొక్క సమూహము కూడా లేదు
ఎప్పుడైతే కణాల యొక్క సమూహము కూడా లేదో
అప్పుడు జననము, మరణము కూడా లేవు
నిజమేమిటంటే జననము, మరణము ఎన్నడూ జరగలేదు

జననము, మరణము ఎన్నడూ జరగలేన్నప్పుడు
ప్రాణము ఏమిటి?

ప్రాణము ప్రాణముగానే ఉన్నది
ప్రాణము ఒక రూపాన్ని, మరొక రూపాన్ని, మరొక రూపాన్ని, మరొక రూపాన్ని... ఇలా
ఆపాదించుకుంటూ పోతుంది.
అంటే ప్రాణము ఎన్నడూ జనించలేదు, ఎన్నడూ మరణించనూలేదు.
ప్రాణము ఎప్పుడు ఆలోచనల యొక్క ఆధారముతో, ఆపాదించుకున్నటువంటి గుర్తింపులతో, రూపాలను మార్చుకుంటూ, రూపాలను మార్చుకుంటూ మాత్రమే ఉన్నది.

ఇది సత్యమైతే,
ప్రాణము ఏమిటి?
ప్రాణము ప్రాణమే, అది ప్రాణముగానే ఉన్నది.
అనంతంగా అది రూపాలను మార్చుకుంటూ దాని ఉనికిని దృగ్గోచరము చేస్తున్నది.

ఇది సత్యమైతే,
జననమేమిటి?, మరణమేమిటి?
జననము మరణము మాయ యొక్క స్వరూపాలు మాత్రమే
ఇవి అనంతంగా జరుగుతున్నటువంటి ప్రాణము యొక్క రూపాంతరాల కదలికలు మాత్రమే

ప్రాణాయామము ద్వారా ప్రాణమును నియంత్రించిన నాడు
ప్రాణము యొక్క రూపాంతరాల కదలికలను నియంత్రించండం జరుగుతుంది

ఎప్పుడైతే ప్రాణము యొక్క రూపాంతరాల కదలికలను నియంత్రించండం జరుగుతుందో
అప్పుడు జనన మరణాలను నియంత్రించండం జరుగుతుంది
అనగా ప్రాణాయామము మోక్ష హేతువగుచున్నది.

No comments:

Post a Comment