Friday, January 15, 2016

I Come To Tell You All of Him by Paramahansa Yogananda

I come to tell you all of Him by Paramahansa Yogananda

I come to tell you all of Him,
And the way to encase Him in your bosom,
And of the discipline which brings His grace.

వచ్చాను నేను ఆ పర్మాత్ముడి గురుంచి పూర్తిగా మీకు చెప్పడానికి
మరియు ఆయనను మీ హృదయ గహ్వరంలో ఎలా పదిలపరచుకోవచ్చో
మరియు క్రమశిక్షణ వల్లనైతే ఆయన కృపకు పాత్రులు కాగలరో

To those of you who have asked me
To guide you to my Beloved's silently talking mind,
Or speak to you through a gentle significant glance,
Or whisper to you through my love,
Or loudly dissuade you when you stray away from Him.

ఎవరైతే ఆయనను గురుంచి నన్ను కోరారో
వారికి మార్గ నిర్దేశం చేస్తాను నా ప్రియతముని యొక్క నిశ్శబ్దపు సంభాషించే మనస్సు వైపుకి, లేదా
మాట్లాడుతాను మీతో సున్నితమైన ముఖ్యమైన చూపుతో, లేదా
గుసగుస లాడుతాను నా ప్రేమ ద్వారా, లేదా
మీరు ఆయన నుంచి దూరంగ విడివడి వెళితే, నివారిస్తాను గట్టిగా మిమ్మల్ని

But when I shall become only a memory or a mental image,
Or silently speaking voice,
When no earthly call will ever reveal
My whereabouts in unplumbed space
When no shallow entreaty or stern stentorian command
Will bring an answer from me,
I will smile in your mind when you are right,
And when you are wrong, I will weep through my eyes,
Dimly peering at you in the dark,
And weep through your eyes, perchance;
And I will whisper to you through your conscience,
And I will reason with you through your reason,
And I will love through your love.

కాని నేనెప్పుడైతే ఒక జ్ఞాపకంగా లేదా ఒక మానసిక చిత్రంగానే  ఉంటానో
లేదా నిశ్శబ్దంగా మాట్లాడే ధ్వనిగా ఉంటానో,
ఎప్పుడైతే స్థూల పిలుపు బహిర్గతం చెయ్యదో,
నా ఆచూకీ గురించి పరిమితాలులేని దిగంతాలలో,
ఎప్పుడైతే మీ నిస్సారమైనటువంటి అనురోధం ద్వారా లేదా కఠినమైనటువంటి పిలుపు ద్వారా,
నా సమాధానం మీకు రాదో,
చిరునవ్వు నవ్వుతాను మీ మనస్సులో మీరు సరియైనప్పుడు,
మరియు ఏడుస్తాను నేను నా కళ్ళతోటి మీరు తప్పు చేసినప్పుడు,
మందంగా చూస్తూ ఉంటాను మీ వైపు చీకట్లో,
అనుకోకుండా ఏడుస్తాను మీ కళ్ళతోటి,
మరియు గుసగుసలాడుతాను మీ తోటి మీ అంతఃకరణ ద్వారా,
మరియు మీతో వివేచిస్తాను మీ వివేకముద్వారా,
మరియు నేను ప్రేమిస్తాను మీ ప్రేమద్వారా

When you are able no longer to talk to me,
Read my Whispers of Eternity.
Eternally through that I will talk to you.
Unknown I will walk by your side
And guard you with invisible arms.

మీరు ఎప్పుడైతే నా తోటి మాట్లాడలేకపోతారో
చదవండి నా "నిత్యత్వపు గుసగుసలు" (శాశ్వతత్త్వపు గుసగుసలు)
వాటి ద్వారా మాట్లాడుతాను మీతో నేను
మీకు తెలియకుండా మీ ప్రక్కనే నడుస్తాను
మరియు కాపాడుతాను మిమ్మల్ని నా అదృశ్యపు హస్తాలాతో

And as soon as you know my Beloved
And hear His voice in silence,
You will know me again more tangibly
Than you knew me in this earth plane.

మరియు ఎప్పుడైతే మీరు నా ప్రియతముని తెలుసుకుంటారో
ఎప్పుడైతే ఆయన వాక్కును నిశ్శబ్దములో వింటారో
తెలుసుకుంటారు మీరు నన్ను నిజంగా,
భూమి మీద నన్ను తెలుసుకున్నదానికంటె,

And yet when I am only a dream to you
I will come to remind you that you too are naught
But a dream of my Heavenly Beloved,
And when you know you are a dream, as I know now,
We all will be ever awake in Him.

మరియు నేనెప్పుడైతే మీకు ఒక కలగా మాత్రమే ఉంటానో
వస్తాను నేను మీకు గుర్తు చేయడానికి, మీరు కూడా ఏమి కారని,
నా స్వర్గ ప్రియతముని కల తప్ప, మరియు
నేను తెలుసుకున్నట్టుగా మీరు కూడా ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరొక కల మాత్రమేనని ,
మేలుకుంటాము శాశ్వతంగా మనమందరము పరమాత్మునిలో.

- శ్రీ శ్రీ పరమహంస యోగానంద 

No comments:

Post a Comment