ఏమిటి మనము చేయగలిగింది?
చేసుకుంటూ పోవడమే,
నేర్చుకుంటూ పోవడమే.
చేసుకుంటూ, నేర్చుకుంటూ
ముందుకు వెళ్ళడమే,
మనము చేయగలిగింది.
తప్పు జరిగినప్పుడల్లా
మనకు మనము
విశ్లేషించి సరిదిద్దుకుంటూ
బనత్ బనత్ బన్ జాయే
అన్న నానుడిని చాటుకుంటూ
ముందుకు వెళ్ళడమే,
మనము చేయగలిగింది.
ఓ గురుదేవా!
అనుక్షణం నీవు నిర్దేశించిన
దారిలొ ప్రయాణించ గలిగే
సంస్కారాన్ని ఇవ్వు తండ్రి.
అని మొరపెట్టుకోవడమే
మనము చేయగలిగింది.